Breaking News

ప్రపంచంలో బర్డ్‌ ఫ్లూతో తొలి మృతి నమోదు

Published on Thu, 06/06/2024 - 13:25

కరోనాకు మించిన ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్న హెచ్‌5 ఎన్‌1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) పలు దేశాలకు విస్తరిస్తోంది. పశువులు, పాల ద్వారా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకుతోంది. అమెరికాలోని పలు నగరాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో హెచ్5ఎన్1 వైరస్ కేసుల పెరుగుదలపై భారతదేశం కూడా అప్రమత్తమైంది. హెచ్5ఎన్1 వైరస్‌ను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మరణం నమోదయ్యిందని తెలిపింది. మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే ఆ వ్యక్తికి వైరస్‌ ఎలా సోకిందనే విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ఏజెన్సీ వెల్లడించలేదు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు తదితర లక్షణాలతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అతను అప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్నాడు.

మే 23న ఈ కేసు గురించి తమకు మొదట తెలిసిందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది కరోనావైరస్ కంటే వంద రెట్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన నివేదికలో ప్రస్తుతానికి ఒకరి నుండి మరొకరికి హెచ్5ఎన్1 వైరస్ సోకిన సందర్భాలు కనిపించలేదు. అయినప్పటికీ ఈ వైరస్‌ విషయంలో ప్రతిఒక్కరూ  అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈ వైరస్ సంక్రమించినప్పుడు దాని లక్షణాలు తేలికపాటి నుండి తీవ్ర స్థాయి వరకూ ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో బర్డ్ ఫ్లూపై భారత ప్రభుత్వం ఒక సలహాను జారీ చేసింది. ఈ వైరస్‌ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది.  ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

#

Tags : 1

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)