Breaking News

New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్‌

Published on Tue, 12/31/2024 - 12:13

మనమంతా మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం-2025లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇంతలో అమెరికా జనాభా బ్యూరో ఒక ఆసక్తిక నివేదికను వెలువరించింది. 2025 నూతన సంవత్సరం తొలిరోజునాటికి  ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని, దీనిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని తెలియజేసింది.

2024 చివరి నాటికి ప్రపంచ జనాభా(World population) 7.1 కోట్లు పెరిగిందని, కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని తాజాగా అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023నాటి జనాభాతో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గడంతోపాటు 0.9 శాతంగా నమోదైంది. 2025 విషయానికొస్తే జనవరిలో ప్రపంచ జనాభా మరో 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రపంచంలో ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు నమోదవుతాయని ఈ నివేదిక అంచనా వేసింది.

2024లో అమెరికా జనాభా 26 లక్షల మేరకు పెరిగింది. 2025 నాటికి అమెరికా జనాభా(US population) 34.1 కోట్లకు చేరుతుందని  బ్యూరో అంచనాలున్నాయి. నూతన సంవత్సరం జనవరిలో అమెరికాలో ప్రతి తొమ్మిది సెకండ్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం ఉంటుందనే అంచనాలున్నాయి. 2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షల మేరకు పెరిగింది. ఈ పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉంది. 2010 దశకంలో అగ్రరాజ్యం జనాభా పెరుగుదల 7.4 శాతం ఉంది. 2024లో భారతదేశ జనాభా 144.17 కోట్లు. 2025 భారత జనాభా అన్ని దేశాలను మించి టాప్‌లో ఉండే అవకాశాలున్నాయని అమెరికా జనాభా బ్యూరో అంచనా వేసింది.

ఇది కూడా చదవండి:  New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)