Breaking News

ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్‌ రైల్వేస్టేషన్‌ 

Published on Mon, 03/24/2025 - 06:14

టోక్యో: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి జపాన్‌లోని ఓ రైల్వే ఆపరేటింగ్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ స్టేషన్‌ చుట్టకొలత 108 చదరపు అడుగులు. జపాన్‌లో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన ఒసాకా నుంచి 60 మైళ్ల దూరంలోని దక్షిణ వకయామ ప్రావిన్స్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించబోతున్నట్లు వెస్ట్‌ జపాన్‌ రైల్వే(జేఆర్‌ వెస్ట్‌) సంస్థ తాజాగా ప్రకటించింది. 

ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్‌ ఉంది. అది చాలావరకు దెబ్బతినడంతో పూర్తిగా కూల్చివేసి 3డీ ప్రింటెడ్‌ స్టేషన్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త స్టేషన్‌ చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సెరెండిక్స్‌ అనే నిర్మాణ సంస్థ సైతం ఇందులో భాగస్వామిగా మారుతోంది. 

3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. కొత్త టెక్నాలజీతో రైల్వే స్టేషన్‌నిర్మాణం కేవలం ఆరు గంటల్లో పూర్తి కానుంది. జపాన్‌లో ప్రస్తుతం పనిచేసే సామ ర్థ్యం కలిగిన యువత సంఖ్య తగ్గుతోంది. వృద్ధు ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి అందుబాటులో లేకుండాపోతోంది. అందుకే తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తయ్యే టెక్నాలజీపై జపాన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో తక్కువ మంది కార్మికులతో నిర్మాణాలు చకచకా పూర్తి చేయొచ్చు. ఇందులో భవనం విడిభాగాలను ముందుగానే తయారు చేస్తారు. నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి వాటిని బిగించేస్తారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)