Breaking News

రూ. 1.4 కోట్ల జాక్‌పాట్‌ : నిద్రలేమే వరంలా మారింది

Published on Sat, 07/18/2026 - 12:07

నార్త్‌ కరోలినా (North Carolina)లో సూ రౌలీ ఇన్‌సోమ్నియా బాధపడుతోంది. అలా నిద్రపట్టని ఒక రాత్రి ఆమెకు ఏకంగా రూ. 1.4 కోట్ల జాక్‌పాట్ తెచ్చిపెట్టింది. కేవలం కాలక్షేపం కోసం ఆడిన ఆన్‌లైన్‌ లాటరీ గేమ్ ఆమెకు భారీ బహుమతిని  అందించింది. మోరెస్విల్లే నివాసి అయిన సూ రౌలీ (Sue Rowley) జూలై 8 రాత్రి నిద్ర రాకపోవడంతో సమయం గడపడానికి స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ లాటరీ గేమ్ ఆడటం ప్రారంభించింది. అలా కొత్తగా వచ్చిన 'టంబ్లింగ్ ట్రెజర్స్' (Tumbling Treasures) అనే గేమ్‌లో రౌలీ 30  డాలర్లు పెట్టి ఆడింది. కానీ ఆమెకు అనుకోని అదృష్టం కలిసి వస్తుందని అస్సలు ఊహించలేదు.  లాటరీ అధికారుల ప్రకారం, ఈ గేమ్‌లో ఇంత పెద్ద బహుమతి గెలుచుకునే అవకాశం  20 లక్షలమందిలో ఒకరికి మాత్రమే ఉంటుందట.

తెరపై అంత పెద్ద మొత్తాన్ని చూసినప్పుడు మొదట నమ్మలేకపోయానని రౌలీ చెప్పింది. అర్థరాత్రి  నిద్ర రాక, ఊరికే అలా ఫోన్‌తో ఆడుకుంటూ  ఉండగా వరించిన అదృష్టమని తెలిపింది.  ముందు అస్సలు నమ్మలేకపోయాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. సోమవారం (జూలై 13) రాలీలోని లాటరీ ప్రధాన కార్యాలయంలో తన బహుమతి మొత్తాన్ని అందుకుంది. నిద్రలేమిని కాస్తా అదృష్టంగా మార్చుకున్న రౌలీ, ఈ డబ్బుతో తన ఇంటిని రిపేర్/రినోవేషన్ చేయించు కోవాలని ప్లాన్ చేస్తోంది.

గతంలో బౌద్ధ సన్యాసికి
గత నెలలో 73 ఏళ్ల బౌద్ధ సన్యాసి, బ్యాంక్ లక్కీ డ్రాలో గెలిచి రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యారు. పూర్వం ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేసి,ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటున్న చాన్ చాయ్ సియాంగ్ సుమారు రూ. 2.28 కోట్లు గెలుచుకున్నారు.

ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్‌ను హతమారిస్తే. రూ. 96 కోట్లు
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)