Breaking News

ఎయిర్‌పోర్టులో వీరంగం.. కంప్యూటర్లను నేలకేసి కొట్టి.. 

Published on Thu, 07/06/2023 - 16:15

మెక్సికో: మెక్సికో సిటీ ఎయిర్‌పోర్టులో ఒక మహిళ ప్రయాణానికి సంబంధించి తాను రిజర్వేషన్ చేసుకున్న టికెట్ వివరాలు కంప్యూటర్లో   కనిపించకపోయే సరికి కోపంతో అక్కడి సిబ్బందిపై వీరంగం చేసి ఆఫీసులోని పరికరాలను ధ్వంసం చేసింది.

వివరాల్లోకి వెళ్తే మరియ గువాడులూపే(56) అనే మహిళ , మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణానికి ముందుగానే ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకుంది. యధాలాపంగా చెకిన్ అవడానికి బోర్డింగ్ పాస్ కోసం కౌంటర్ వద్దకు వెళ్లగా ఆమె వివరాలు కంప్యూటర్లో ఎంత వెతికినా కనిపించక ఆమె ప్రయాణం చేయడానికి కుదరదని చెప్పారు వోలారిస్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి.

దీంతో ఆమె..  నా టికెట్ డబ్బులు నాకు తిరిగి వాపసు ఇవ్వమని అడిగింది. అందుకు వోలారిస్ ప్రతినిధి స్పందిస్తూ.. డబ్బులు కావాలంటే మీరు బుక్ చేసిన ఏజెన్సీకి వెళ్లి అడగాలని కోరారు.  అంతే కోపంతో ఊగిపోయిన ఆ మహిళ ఆఫీసులోకి చొరబడి అక్కడి ఉద్యోగులను నానా మాటలంటూ.. నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మీరంతా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అరుస్తూ అక్కడి పరికరాలను ఇష్టమొచ్చినట్టు విసిరేస్తూ విధ్వంసం చేసింది.

ఆమె కోపానికి నాలుగు కంప్యూటర్ మానిటర్లు నాలుగు బార్ కోడ్ స్కానర్లు ధ్వంసమయ్యాయి. చేసిందంతా చేసి గువాడులూపే తనదారిన తాను వెళ్లిపోయే ప్రయత్నం చేయగా అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)