ఒకే కాన్పులో పుట్టిన 9 మంది చిన్నారుల.. నాలుగో హ్యాపీ బర్త్‌ డే

Published on Sat, 07/05/2025 - 08:49

ఈవిడ ఎవరన్నది మీరు మర్చిపోయి ఉంటారు..  నాలుగేళ్ల క్రితం మీడియాలో మార్మోగిన పేరు.. హలీమా.. గంపెడు సంతానానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఈ పిల్లలూ మామూళోళ్లు కారు.. రికార్డు బ్రేకింగ్‌ పిల్లలు. నాలుగేళ్ల క్రితం ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చి.. మాలీ దేశానికి చెందిన హలీమా గిన్నిస్‌ రికార్డు సాధించారు. 9 మంది పుట్టడం రికార్డైతే.. అందరూ బతికిబట్టకట్టడం.. ఇదిగో ఇప్పుడిలా నాలుగో జన్మదినాన్ని జరుపుకోవడం అరుదైన విషయమేకదా.. ఈ సందర్భంగా తండ్రి అర్బీ, తల్లి హలీమాతో వారు దిగిన ఈ ఫొటోను గిన్నిస్‌ బుక్‌ తన వెబ్‌సైట్లో షేర్‌ చేసుకుంది.  

సర్పానికి చికిత్స 
అచ్చంపేట రూరల్‌: గాయపడిన ఒక సర్పానికి వెటర్నరీ వైద్యుడు చికిత్స చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం సమీపంలోని కోళ్లఫారం వద్ద కొన్నిరోజులుగా పెద్ద పాము సంచరిస్తుండడంతో.. యజమాని స్నేక్‌క్యాచర్‌ సుమన్‌కు సమాచారం అందించాడు. శుక్రవారం కోళ్లఫారం వద్ద పామును పట్టుకునే క్రమంలో.. అతని వద్ద ఉన్న పరికరం గుచ్చుకుని పాముకి గాయమైంది. వెంటనే ఆయన పామును అచ్చంపేటలోని పశువుల ఆస్పత్రికి తీసుకురాగా.. వెటర్నరీ వైద్యుడు హరీశ్‌ చికిత్స చేశారు. అనంతరం పామును అడవిలో వదిలేశారు.   

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)