Breaking News

‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్‌’ పాస్‌ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!

Published on Mon, 07/17/2023 - 07:38

ఎవరైనా సరే తమకు సంబంధించిన ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యల్లో పడతారు. ఇటువంటి నేపధ్యంలోనే అస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ​ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. 

ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో..
బాలీ విమానాశ్రయం అధికారులు ఒక ఆస్ట్రేలియా యువతి దగ్గరున్నది ‘డర్టీ పాస్‌పోర్ట్‌’ అని ఆరోపిస్తూ, రూ. 1000 డాలర్లు వసూలు చేశారు. అధికారులు ఆమె దగ్గరున్న ‘డర్టీ పాస్ట్‌పోర్ట్‌’ను స్వీకరించలేమని పేర్కొన్నారు. న్యూయార్క్‌ పోస్ట్‌ రిపోర్టును అనుసరించి 28 ఏళ్ల యువతి తన తల్లితోపాటు సెలవుల్లో ఎంజాయ్‌ చేసేందుకు ఇండోనేషియా వెళుతోంది. బాటిక్‌ ఎయిర్‌పోర్టు కౌంటర్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె దగ్గరున్న పాస్‌పోర్ట్‌ పాతబడిపోవడంతో ఆమె కొత్తగా ఒక ఫారం నింపాల్సి వచ్చింది. 

7 సంవత్సరాల క్రితంనాటిది కావడంతో..
ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెచేత ఒక ప్రత్యేకమైన నీలిరంగు ఫారం మీద సంతకం చేయించారు. దానిని తనతో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ పత్రానికి  సంబంధించిన ప్రక్రియతోపాటు ఇమిగ్రేషన్‌ పూర్తయిన తరువాత వారికి విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ఆ పాస్‌పోర్ట్‌ 7 సంవత్సరాల క్రితంనాటిది. దీంతో అది కాస్త మురికిగా తయారయ్యింది. 

‘నన్ను ఎగతాళి చేశారు’
ఆమె తన అనుభవాన్ని వివరిస్తూ ‘మాకు నిజమైన ఇబ్బంది బాలీ ఎయిర్‌పోర్టులో ఎదురయ్యింది. బాలీ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌కు ముందు అధికారులు నన్ను గంటపాటు ప్రశ్నించారు. వారు నన్ను చూసి నవ్వారు. చట్టాన్ని అతిక్రమించానని ఆరోపించారు. నా పాస్‌పోర్ట్‌ డ్యామేజ్‌ అయ్యిందంటూ ఎగతాళి చేశారు. 1000 డాలర్లు కడితే నా సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో పాస్‌పోర్ట్‌ తిరగి ఇవ్వబోమని తెలిపారు. 

పాస్‌పోర్ట్‌ తిరిగి ఇవ్వబోమంటూ..
ఇటీవలే నేను ఉద్యోగాన్ని కోల్పోవడం వలన అంత మెత్తం చెల్లించలేనన్నాను. వెంటనే అధికారులు మా అమ్మతో మాట్లాడి, తన డర్టీ పాస్‌పోర్ట్‌ చెల్లుబాటుకు అనుమతినివ్వాలంటే 1000 డాలర్లు చెల్లించాలని మరోమారు తెలిపారు. అయితే ఆమె కూడా ఇందుకు సమ్మతించలేదు. దీంతో అధికారులు తన పాస్‌పోర్ట్‌ తిరిగి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోమార్గం లేక అధికారులకు వారు అడిగినంత మొత్తం చెల్లించామని, అ‍ప్పుడు తమ ప్రయాణానికి ఏర్పడిన ఆటంకం తొలగిపోయిందని’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్‌కే షాక్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)