Breaking News

మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది!

Published on Sat, 08/05/2023 - 08:52

జార్ఖండ్‌లోని రాంచీ సివిల్‌ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతో పాటు ఇతర లాయర్లు చావచితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు చేరుకుని, భర్తపై దాడి చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం చెలరేగింది.

కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్‌కు అతని ముగ్గురు భార్యలకు మధ్య జరిగిన వివాదం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న స్థానికులంతా కలసి ఆ లాయర్‌పై తలొదెబ్బ వేశారు. తమ భర్త తమ కళ్లుగప్పి, నాలుగో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని అతని భార్యలు మీడియాకు తెలిపారు.

నయీముద్దీన్‌ ఉరఫ్‌ నూరి అనే న్యాయవాది ముగ్గురు భార్యలు మీడియాతో మాట్లాడుతూ తమ భర్త అతని దగ్గర పనిచేసే జూనియర్‌తో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆమెను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. ఆ న్యాయవాది ముగ్గురు భార్యలు ఈ విషయమై మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నయీముద్దీన్‌ రాంచీలోని సివిల్‌ కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఇటీవల అతని ముగ్గురు భార్యలు అతనిని కలుసుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు అతను వారిని నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ముగ్గురు భార్యలు అతనిపై చేయిచేసుకున్నారు. నయీముద్దీన్‌ మొదటి భార్య అదే సివిల్‌ కోర్టు ఉద్యోగి. దీంతో ఆమె సహోద్యోగులు ఆమెకు సహకారం అందిస్తూ, ఆ న్యాయవాదిపై దాడి చేశారు. ఈ  ఉదంతంపై భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇది కూడా చదవండి: వైట్‌హౌస్‌ భారతీయ- అమెరికన్‌ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్‌’కు తిరుగుముఖం!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)