Breaking News

అమెరికాలో ‘మంచు’ బీభత్సం

Published on Wed, 01/08/2025 - 02:03

వాషింగ్టన్‌: తుఫాను కారణంగా తూర్పు అమెరికా అంతటా భారీ మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఐదుగురు మృతి చెందారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో లక్షలాది మంది అంధకారంలో ఉండిపోయారు. 2,400కు పైగా విమానాలు రద్దయ్యాయి. వాషింగ్టన్‌లో ఒక అడుగు వరకు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ (ఎన్‌డబ్ల్యూఎస్‌) అంచనా వేసింది. పరిస్థితులను అధ్యక్షుడు జో బైడెన్‌ నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రభావిత రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వైట్‌హౌస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

అమెరికా రాజధానిలోని ఇళ్లన్నీ మంచులో కూరుకుపోయాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని పాఠశాలలు మూసివేశారు. కాన్సాస్, మిస్సోరి సహా పలు రాష్ట్రాల్లో మంచు తుఫాను పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. కెంటకీ, మిస్సోరి, వర్జీనియా, మేరీల్యాండ్‌ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోడ్లను క్లియర్‌ చేయడానికి అత్యవసర నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని గవర్నర్లు, స్థానిక అధికారులు కోరారు. ఆగ్నేయ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, వడగండ్లు, టోర్నడోలు వస్తాయని ఎన్‌డబ్ల్యూఎస్‌ హెచ్చరించింది. మంచు దట్టంగా పేరుకుపోతుందని, శక్తివంతమైన గాలులతో చెట్లు కూలిపోతాయని, దీర్ఘకాలిక విద్యుత్‌ అంతరాయం కలిగే అవకాశముందని తెలిపింది. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)