Breaking News

క్యాబ్‌ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!

Published on Wed, 06/25/2025 - 15:54

అవును. నిజం. ఒకట్రెండేళ్లలో క్యాబ్‌డ్రైవర్లు అనే వారు ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కారణంగా ఊబర్‌, ఓలా, ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్‌ డ్రైవర్ల ఆదాయంలో కొంత వాటా పంచుకుంటూంటే... రోబోటిక్స్‌, అటానమస్‌ వెహికల్‌ టెక్నాలజీ కాస్తా... డ్రైవర్ల ఉద్యోగాలకే గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ల అవసరం లేని కార్లను టెస్లా ఎప్పుడో తయారు చేసింది కదా? అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని అంటున్నారా?సింపుల్‌.. టెస్లాతోపాటు ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇప్పుడు ఈ అటానమస్‌ వెహికల్‌ టెక్నాలజీని క్యాబ్స్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి! 

టెస్లా ఇప్పటికే తన సైబర్‌ ట్రక్‌ను క్యాబ్‌ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తూండగా.. అమెజాన్‌ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్డ్‌ ప్రాంతంలో అమెజాన్‌ సుమారు 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోబో ట్యాక్సీల తయారీకి ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్కులాంటి ఈ వాహనం పేరు జూక్స్‌. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా కొన్ని వాహనాలు లాస్‌ వేగస్‌ నగరంలో పరుగులు పెడతాయి కూడా. ఆ తరువాత.. 

 

దశలవారీగా మయామీ, ఆస్టిన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలకు వీటి సేవలను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాన్లను టెస్ట్‌ ట్రాక్‌పై నడిపి పరిశీలిస్తున్నారు కూడా. డ్రైవింగ్‌ తీరుతెన్నులు, పికప్‌.. డ్రాప్‌ఆఫ్‌ల సందర్భంగా ఏమేం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. 

మరోవైపు.. టెస్లా కంపెనీ కూడా తన సైబర్‌ ట్రక్‌ను కాస్తా సైబర్‌ క్యాబ్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉంది. 2027 నాటికి తొలి దశ వాహనాలను రోడ్లపైకి ఎక్కిస్తారు. రోబోట్యాక్సీ అని పిలుస్తున్న ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు. స్టీరింగ్‌ వీల్‌, పెడల్స్‌ వంటివేవీ ఉండవు. అన్నీ కృత్రిమ మేధ ద్వారానే జరిగిపోతాయి. ఒకసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ముందు, వెనుక ఎక్కడ అద్దాలుండవు. కెమెరాలు, సెన్సర్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్‌ చేస్తుందీ వాహనం. ఒక్కో రోబోట్యాక్సీని 30,000 డాలర్లకు అమ్మేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. 

మానవ డ్రైవర్ల పరిస్థితి?
జూక్స్‌, రోబోట్యాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డుకాలమే!. ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పరిమితం కావచ్చు కానీ... భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు మరీ ముఖ్యంగా వివిధ దేశాల్లోని నగర ప్రాంతాలకు విస్తరించడం ఖాయం. అదే జరిగితే ట్యాక్సీ డ్రైవర్లకు డిమాండ్‌ తగ్గిపోతుంది. రోబో ట్యాక్సీలో ఒక ఒక మైలు ప్రయాణించేందుకు 0.20 డాలర్లు ఖర్చు అవుతుందని, బస్సులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు తక్కువ అని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. ఇదే వాస్తవమైతే చవక కాబట్టి వీటిల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతారు. కాకపోతే..

మానవ డ్రైవర్లను ఈ రోబోట్యాక్సీ నిర్వహణకు ఉపయోగించుకోవచ్చునని ఒక అంచనా. అంతేకాదు... కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రోబో ట్యాక్సీలు మానవ డ్రైవర్లను పూర్తిగా లేకుండా చేయలేవు. ఎందుకంటే ఇలాంటి వాహనాల భద్రత, నియంత్రణలకు సంబంధించిన నిబంధనలు ఇప్పటివరకూ రూపుదిద్దుకోలేదు. ప్రభుత్వాలు పూనుకుని వీటిని సిద్ధం చేసేందుకు చాలా సమయమే పట్టవచ్చు. మరికొంత మంది అభిప్రాయం ప్రకారం అటానమస్‌ వాహనాలు నగరాల్లో కొన్ని నిర్దిష్ట మార్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సంక్లిష్టమైన రూట్లలో మానవ డ్రైవర్లనే ఉపయోగిస్తారు. 

::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Photos/Videos Credits: zoox.com/newatlas.com

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు