Breaking News

ట్రంప్‌ సంచలన ప్రకటన

Published on Mon, 11/03/2025 - 08:05

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. క్రైస్తవులను అన్యాయంగా చంపేస్తూ చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపిస్తూ ఆఫ్రికన్‌ దేశం నైజీరియాపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనిక చర్య తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యే నైజీరియాను అమెరికా ‘కంట్రీస్‌ ఆఫ్‌ పర్టికులర్‌ కన్సర్న్‌’ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసపై తీవ్రంగా స్పందించారు. ఫ్లోరిడాలో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. నైజీరియాలో క్రైస్తవులను రికార్డు స్థాయిలో హత్య చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలోనే చంపుతున్నారు.  నైజీరియాలో క్రైస్తవులు తీవ్ర ముప్పులో ఉన్నారు. ఇక మీదట అలా జరగనివ్వబోను. అవసరమైతే అమెరికా బలగాలను మోహరిస్తాం. వైమానిక దాడులు జరుపుతాం. ఇప్పటికే యుద్ధ విభాగానికి(Department of War) ఆదేశాలు కూడా జారీ చేశాను’’ అని తీవ్ర హెచ్చరికలే జారీ చేశారాయన. అంతకు ముందు.. 

శుక్రవారం కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. నైజీరియాలో క్రైస్తవత్వం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ హింసకు రాడికల్ ఇస్లామిస్టులు కారణమని ఆయన ఆరోపించారు. ఇది ఆగకపోతే నైజీరియాకు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరిస్తూనే.. గన్స్-అ-బ్లేజింగ్ అంటూ అమెరికా సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. 

సీపీసీ అంటే..
తాజాగా నైజీరియాను కంట్రీస్‌ ఆఫ్‌ పర్టికులర్‌ కన్సర్న్‌(CPC) జాబితాలో  చేర్చారు. ఆ వెంటనే ఆ జాబితా వెలువడడం గమనార్హం. సీపీసీని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ తయారు చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం (International Religious Freedom Act - IRFA) 1998 ప్రకారం.. ప్రతి ఏటా ఈ జాబితాను రివైజ్‌ చేస్తుంటారు.  అమెరికా విదేశాంగ కార్యదర్శి (U.S. Secretary of State) ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. 

ఈ జాబితాలో మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాలు ఉంటాయి. మతపరమైన హింస, వివక్ష, బలవంతపు మత మార్పిడిలు, మతపరమైన హక్కుల హననంలాంటి అంశాల ఆధారంగా ఈ లిస్ట్‌ రూపొందిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల మినహాయింపులు ఇవ్వవచ్చు. నైజీరియాతో పాటు చైనా, మయన్మార్, ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

నైజీరియా స్పందన
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు బోలా టిన్బు వ్యాఖ్యానించారు. అయితే.. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇవ్వాలని కోరారు. ‘‘ఆయన నైజీరియా పట్ల సానుకూలంగా ఉన్నారనే భావిస్తున్నాం. ఇరు దేశాధినేతలు కూర్చుని మాట్లాడుకుంటే.. ఉగ్రవాదాన్ని అణచివేయడం అంత కష్టమేమీ కాదు. ఆయన్ని త్వరలోనే మా అధ్యక్షుడు కలవాలనుకుంటున్నారు’’ అంటూ అధ్యక్ష సలహాదారు డేనియల్‌ బ్వాలా చెబుతున్నారు. 

నైజీరియాలో ఏం జరుగుతోందసలు.. 
నైజీరియాలో బోకోహరాం, ఇస్లామిక్‌ స్టేట్‌ వెస్ట్‌ ఆఫ్రికా ప్రావిన్స్‌( ISWAP) వంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు గత కొంతకాలంగా హింసాత్మక చర్యలు కొనసాగిస్తున్నాయి. వీటికి తోడు రైతులు గొర్రెల కాపరులు మధ్య ఘర్షణలు.. మతపరమైన, జాతిపరమైన రూపం సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్రైస్తవులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా..

ప్లాటూ, బెన్యూ, కడునా రీజియన్లలో క్రిస్టియన్లపై దాడులు పరిపాటిగా మారాయి. నైజీరియన్‌ సంస్థల కథనాల ప్రకారం.. 2019 నుంచి  ఇప్పటిదాకా 600 మంది క్రైస్తవులు దారుణ హత్యకు గురయ్యారు ఇక్కడ. అయితే.. కొన్ని గ్లోబల్‌ సంస్థలు మాత్రం ఆ సంఖ్య 7,000 దాకా ఉండొచ్చని చెబుతున్నాయి. అలాగే లక్షల మంది నిరాశ్రయులయ్యారని అంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంతర్యుద్ధాల కారణంగా అవి ఫలించడం లేదు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)