Breaking News

అందుకే కమలా హారిస్‌కు ఒబామా మద్దతు ఇవ్వటం లేదు!

Published on Thu, 07/25/2024 - 14:09

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలిగారు. జో బైడెన్‌ స్వయంగా కమలా హారిస్‌ పేరును అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ.. మద్దతు ప్రకటించారు. దీంతో అధ్యక్ష అభ్యర్థి స్థానంలో ఇండో-అమెరికన్‌ కమలా హారిస్‌ పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. 

ఇక.. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మాత్రం కమలా హారిస్‌కు మద్దతుగా ప్రకటన లేదు. దీనిపై పార్టీలో సైతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే కమలా హారిస్‌ అభ్యర్థిత్వంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌పై కమలా హారిస్‌ గెలిచే అవకాశాలు లేవని ఒబామా భావిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ‘అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీ పడేందుకు కమలా హారిస్‌ శక్తివంతురాలు కాదని ఒబామా భావిస్తున్నారు. ఇప్పటివరకు దేశ సరిహద్దులకు వెళ్లని కమలా వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడుతున్నారు. 

..ఇలాంటి సవాళ్లను దాటి ముందుకెళ్లడం ఆమెకు కష్టమైన పని అని అనుకుంటున్నారు. ప్రెసిడెంట్‌ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నారు. అందుకే హారిస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు రావట్లేదు’ అని ఒబామా కుటుంబ వర్గాలు వెల్లడించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)