Breaking News

13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం

Published on Mon, 02/24/2025 - 12:35

ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది. ఆ మాత్రానికే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆయన్నో ఫెయిల్డ్‌ పొలిటీయన్‌గా అభివర్ణించాయి. మరోవైపు సొంత అధిష్టానం సైతం ఆయన నాయకత్వంపై బలమైన విమర్శలు చేసింది. వాటిని ఆయన తట్టుకోలేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈలోపు దేశాన్ని తీవ్ర సంక్షోభాలు వచ్చి పడ్డాయి. అనూహ్యంగా.. మళ్లీ ఆయనకే నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకత.. అదే సమయంలో ఆయన విధానాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. అద్భుత విజయంతో జర్మనీ ఛాన్స్‌లర్‌ పీఠంపై ఫ్రెడరిక్ మెర్జ్‌ను కూర్చోబెట్టబోతున్నాయి. 

69 ఏళ్ల ఫ్రెడరిక్‌ మెర్జ్‌ జర్మనీ. క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(CDU) తరపున అక్కడి ప్రభుత్వంలో ఎలాంటి కీలక పదవులు, బాధ్యతలు చేపట్టిన దాఖలాలు లేవు. మరి అలాంటి వ్యక్తికి నేరుగా.. జర్మనీ ఛాన్స్‌లర్‌గా అవకాశం ఎందుకు దక్కబోతోంది?. 

👉ఫ్రెడరిక్‌ మెర్జ్‌(Fedrich Merz).. 1955, నవంబర్‌ 11న బ్రిలన్‌లో జన్మించారు. వాళ్లది న్యాయవాద నేపథ్యం ఉన్న కుటుంబం. బోన్‌, మార్‌బర్గ్‌ యూనివర్సిటీల్లో న్యాయవిద్య పూర్తి చేశారు. 1975 నుంచి 76 దాకా మిలిటరీలో పని చేశారు. న్యాయమూర్తిగా, ఆపై కార్పొరేటర్‌ లాయర్‌గానూ పని చేశారు

👉1972లో క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(CDU Party)లో చేరారు. 1989లో తొలిసారి యూరోపియన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1994లో హోచ్సౌర్లాండ్క్రీస్ నియోజకవర్గం నుంచి జర్మనీ ముఖ్య సభ బుండెస్టాగ్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. జర్మనీ పార్లమెంట్‌లో  బుండెస్టాగ్‌, బుండెస్రాట్‌ సభలు ఉంటాయి. ఇవి మన లోక్‌సభ, రాజ్యసభలను పోలి ఉంటాయి.

👉2000 సంవత్సరంలో ఆయన రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది. అప్పటి సీడీయూ అధినేత్రి.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌(Angela Merkel) సీడీయూ పార్లమెంటరీ నేతగా మెర్జ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. రెండేళ్ల తర్వాత మెర్కెల్‌ ఆయన్ని పక్కనపెట్టారు. అందుకు కారణాలు లేకపోలేదు. 

👉2002లో జరిగిన జనరల్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో సీడీయూపై స్వల్ప ఆధిక్యంతో  సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ విజయం సాధించింది.  ఈ ఓటమిని ఏంజెలా మెర్కెల్‌ జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్రెడరిక్‌ మెర్జ్‌ను విఫల నాయకుడిగా ఏకిపారేశాయి. అదే టైంలో.. 

👉ఒకే పార్టీ అయినప్పటికీ ఏంజెలా మెర్కెల్‌కు  ఫ్రెడరిక్‌ మెర్జ్‌ నడుమ రాజకీయ సిద్ధాంతాలపరంగా బేధాలున్నాయి. పదహారేళ్ల పాటు(2005 నుంచి 2021) జర్మనీ ఛాన్సలర్‌గా పని చేసిన మెర్కెల్‌ సెంట్రిస్ట్‌ కావడం.. మెర్జ్‌ సంప్రదాయ రాజకీయవాది, పైగా అతిమితవాద పార్టీ మద్ధతుదారుడు కావడం గమనార్హం. ఈ క్రమంలో.. జనరల్‌ ఫెడరేషన్‌ ఎన్నికల ఓటమిని సాకుగా చూపించి ఆయన్ని పార్లమెంటరీ నేత పదవి నుంచి తప్పించారని అప్పట్లో ఆమెపై సీడీయూలోనే విమర్శలు వచ్చాయి. 

👉కొన్నాళ్ల సీడీయూలోనే క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. 2009లో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తిరిగి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూనే.. మరోవైపు లాబీయిస్ట్‌ అవతారం ఎత్తారు. జర్మనీ బ్లాక్‌రాక్‌ సూపర్‌వైజరీ బోర్డు చైర్మన్‌గానూ వ్యహరించారు.

👉ఈలోపు ఏంజెలా మెర్కెల్‌ రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించే టైంలో.. సీడీయూకి నాయకత్వం వహించేది ఎవరనే చర్చ జోరుగా చర్చ నడిచింది. 2018, 2021 రెండుసార్లు సీడీయూ నాయకత్వం మారగా.. ఆ రెండుసార్లు ఫ్రెడరిక్‌ మెర్జ్‌ పేరే వినిపించింది. కానీ, 

👉అన్నెగ్రెట్ క్రాంప్(2018-21), అర్మిన్ లాస్చెట్(2021-22)లు ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు.. 2022లో ఫ్రెడరిక్‌ మెర్జ్‌కు ఉన్న రాజకీయ అనుభవం పరిగణనలోకి తీసుకుని, ఆయన కన్జర్వేటివ్‌ విధానాలకే ఓటేస్తూ నాయకత్వ బాధ్యతలను సీడీయూ అప్పగించింది.

👉2022లో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫ్రెడరిక్‌ మెర్జ్‌.. బుండెస్టాగ్‌లో ప్రతిపక్ష నేతగా దూకుడుతనం ప్రదర్శించారు. అదే సమయంలో.. ప్రస్తుత ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ నేతృతంలోని సోషల్‌ డెమొక్రటిక్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. ఈ క్రమంలో..  ప్రజాకర్ష విధానాలను ప్రదర్శించారు మెర్జ్‌. 

👉దశాబ్దాలుగా జర్మనీ ఆర్థిక, దౌత్యపరమైన సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో మెర్జ్‌  అక్కడి ప్రజలకు ఓ ఆశాకిరణంగా కనిపించారు. 

👉 తాజాగా ఆదివారం జరిగిన జర్మనీ పార్లమెంటరీ ఎన్నికల్లో..ఫ్రెడరిక్‌ మెర్జ్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ కూటమి సీడీయూ+సీఎస్‌యూ(Christian Social Union in Bavaria) విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఈ విషయాన్ని ఖరారు చేశాయి. విశ్వసనీయుడిచేత జర్మనీ పాలించబడబోతోంది అని ఆయన మద్ధతుదారులు సంబురాలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు ఇవాళే వెల్లడి కానున్నాయి

అయితే మెర్జ్‌ విధానాలపై విమర్శలు లేకపోలేదు

  • శరణార్థులను వెనక్కి తిప్పి పంపాలన్నది ఆయన అభిమతం. అయితే ఆయన ఇమ్మిగ్రేషన్‌ పాలసీని ఏంజెలా మెర్కెల్‌ లాంటి వాళ్లే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. 

  • అతి మితవాద మద్దతుదారుడిగా ఉన్న మెర్జ్‌.. అల్టర్‌నేటివ్‌ ఫర్‌ జెర్మనీ(AfD) పార్టీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాన్ని సీడీయూలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు  

  • మెర్జ్‌ రూపొందిచిన ఆర్థిక విధానాలు.. ధనవంతులకు.. కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసేలా  ఉండడం మరో మైనస్‌

  • అన్నింటికి మంచి.. వ్యాపార ధోరణితో కూడిన ఆయన నాయకత్వ లక్షణంపై అటు విమర్శలతో పాటు ఇటు పొగడ్తలూ వినిపిస్తుంటాయి

  • ఫ్రెడరిక్‌ మెర్జ్‌ జర్మనీ ఛాన్సలర్‌ కావడం ఏంజెలా మెర్కెల్‌ ఇప్పుడు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఓ సీనియర్‌ నేతగా సీడీయూ ఆమె అభిప్రాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది అంతే.

:: సాక్షి వెబ్‌డెస్క్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)