Breaking News

మేఘాలను మరింత మందంగా మార్చేస్తే.. సూర్యకాంతిని అడ్డుకుంటే

Published on Mon, 07/03/2023 - 05:52

వాషింగ్టన్‌:  ఆధునిక యుగంలో మానవాళిని బెంబేలెత్తిస్తున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు. వేడెక్కుతున్న భూగోళం, ఒకవైపు ముంచెత్తుతున్న వరదలు, మరోవైపు తీవ్రమైన కరువులు, పడిపోతున్న పంటల దిగుబడి..  ఇవన్నీ వాతావరణ మార్పుల సంభవిస్తున్న ప్రతికూల ప్రభావాలే. కాలుష్యానికి తోడు నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి.

రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొర క్షీణిస్తుండడంతో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడుతున్న తీవ్రమైన వేడికి భూమి అగ్నిగుండంగా మారిపోతోంది. అలాంటప్పుడు ఈ సమస్య పరిష్కారానికి సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన అమెరికా ప్రభుత్వానికి వచ్చింది. దీనిపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు ‘వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ’ ఓ నివేదిక విడుదల చేసింది. వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవాలన్నదే ఈ పరిశోధన ఉద్దేశం.

జియో ఇంజనీరింగ్‌ విధానంతో సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడం ఎలా అన్నదానిపై పరిశోధన చేస్తున్నట్లు తెలియజేసింది. సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఆకాశంలోని మేఘాలను మరింత మందంగా మార్చడం ద్వారా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పద్ధతిని సిరస్‌ క్లౌడ్‌ థిన్నింగ్‌ అంటారు. జియో ఇంజనీరింగ్‌ అమలు చేయడం సులభమేనని వారి వాదన. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికం. ఆ సమయంలో క్లౌడ్‌ థిన్నింగ్‌ చేయాలన్న యోచనలో ఉన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)