వలసదారులకు సంకెళ్లు.. వైట్‌హౌజ్‌ వివాదాస్పద వీడియో

Published on Wed, 02/19/2025 - 09:45

వాషింగ్టన్‌: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్‌కు పంపించిన  వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్‌హౌజ్‌ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు. 

 

కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)