Breaking News

శాంతియుత దేశం ఏది? అశాంతికి నిలయమెక్కడ? భారత్‌ పరిస్థితేంటి?

Published on Wed, 10/11/2023 - 08:24

అది.. మొన్నటి అక్టోబర్ 7 నాటి ఉదయం.. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగినవార్త హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలాది క్షిపణులను హమాస్ ప్రయోగించింది. అక్కడి ప్రజలు ముందురోజు రాత్రిపూట ఎంత ప్రశాంతంగా నిద్రించారో.. మరుసటి రోజు నాటికి విగతజీవులుగా ఎలా మారారో తలచుకుంటేనే ఆవేదన పెల్లుబికి వస్తుంది. 

ఇటువంటి పరిస్థితిలో ప్రపంచంలో శాంతి కరువైపోతున్నదనే భావన అందరిలో కలుగుతుంది. ఏ దేశంలో ఎప్పుడు దాడి జరగవచ్చో అనే ఆందోళన అందరినీ పట్టిపీడిస్తుంది. ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఎవరూ చెప్పలేకపోయినా, అందుకు బదులుగా ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2023లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్‌లాండ్ గుర్తింపు పొందింది. ఇది 2008 నుండి ఇదే స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు కూడా అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఉన్నాయి. 2023లో ప్రపంచంలో అత్యల్ప శాంతియుత దేశం ఆఫ్ఘనిస్తాన్‌. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఆఫ్ఘనిస్తాన్‌ ఇదే స్థాయిలో ఉంది. యెమెన్, సిరియా, సౌత్ సూడాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు మరో నాలుగు తక్కువ శాంతియుత దేశాల జాబితాలో చేరాయి. 

అత్యధిక జనాభా కలిగిన భారత దేశం  2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ (జీపీటీ)లో 126వ అత్యంత శాంతియుత దేశంగా ఉంది. హింసాత్మక నేరాలు తగ్గుముఖం, పొరుగు దేశాలతో సంబంధాలు, రాజకీయ అస్థిరత కారణంగా గత ఏడాది దేశంలో శాంతి 3.5 శాతం మెరుగుపడింది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కూడా తగ్గింది. 
ఇది కూడా చదవండి: భారత్‌-యూరప్‌ కారిడార్‌తో టర్కీకి ఇబ్బంది ఏమిటి? చైనా సాయంతో ఏం చేయనుంది?

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)