Breaking News

ఎన్నారై డాక్టర్ చేసిన తప్పేంటి? మెడికల్ లైసెన్స్ ఎందుకు లాక్కున్నారు?

Published on Sun, 06/18/2023 - 07:25

కుటుంబ సభ్యులను హతమార్చేందుకు యత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ-అమెరికన్ వైద్యుడు ధర్మేష్ పటేల్ కేసు కొత్త మలుపు తిరిగింది. కాలిఫోర్నియా మెడికల్ బోర్డ్ ఇటీవల పటేల్‌ను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. కుటుంబ సభ్యులను హత్యచేసేందుకు ప్రయత్నించాడంటూ పలు ఆరోపణలను అతను ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. నియంత్రణాధికారులు తెలిపిన వివరాల ప్రకారం పటేల్ మానసిక సామర్థ్య లోపం, బలహీనత ఇతరులకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్న దృష్ట్యా  అతను మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  

కాగా ధర్మేష్‌ పటేల్(41) కాలిఫోర్నియాలోని పసాదేనాకు చెందిన వైద్యుడు. గత జనవరి 2న పటేల్ తన భార్య, తమ ఇద్దరు చిన్న పిల్లలతో సహా  కారులో వెళుతుండగా, అది కొండపై నుండి 250 అడుగుల లోయలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆ నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ధర్మేష్ భార్య నేహా పటేల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ కారు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. తన భర్త ఉద్దేశపూర్వకంగానే కారును శాన్ మాటియో కౌంటీలోని కొండపై నుండి కిందకు మళ్లించినట్లు ఆరోపించారు.

తనను, తన ఇద్దరు పిల్లలను హత్య చేసేందుకే భర్త ఇలా చేశాడని ఆమె పేర్కొన్నారు. తన భర్త పటేల్‌ మానసిక స్థితి సరిగా లేదని ఆమె తెలిపారు. కాగా పటేల్ రేడియాలజీలో నిపుణుడు. ఫ్లోరిడా, ఒరెగాన్, కాలిఫోర్నియాలో చెల్లుబాటు అయ్యే మెడికల్ లైసెన్స్‌లు అతనికి ఉన్నాయి. పటేల్‌ 2008లో వేన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో మెడికల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. గతంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంటర్న్‌షిప్, మయామిలో రెసిడెన్సీ కూడా పూర్తిచేశారు. దీనికితోడు లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా మెడికల్ సెంటర్‌లో ఫెలోషిప్‌ చేశారు.  

ఇది కూడా చదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఎక్కడ ఉందంటే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)