Breaking News

ఘోర విమాన ప్రమాదం.. పైలట్‌ చివరి మాటలివే!

Published on Mon, 11/02/2026 - 09:23

విమానంపై మంచు పేరుకుపోతోంది.. గాలుల తీవ్రతకు విమానం అదుపు తప్పుతోంది. ఏం జరుగుతుందో పైలట్లకూ అర్థం కాని పరిస్థితి. చివరకు ప్రాణాలు కాపాడుకునే అవకాశం లేదని గ్రహించి.. ‘మనం నేలను ఢీకొట్టబోతున్నాం’ అంటూ పైలట్‌ చివరి మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది క్షణాల్లోనే తొమ్మిది మందితో వెళ్తున్న ప్రైవేట్‌ జెట్‌ జనావాసాల మధ్య కుప్పకూలిపో​యింది. అయితే విమానం ఇళ్లకు అతి సమీపంలో కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి

టెక్సాస్‌లోని ఆస్టిన్‌-బెర్గ్‌స్ట్రోమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ ప్రైవేట్‌ జెట్‌ బహామాస్‌కు వెళ్తుండగా జరిగింది. మొదట 10 వేల అడుగుల వేగంతో కిందికి దిగిన విమానం.. ఆ తర్వాత 20 వేల అడుగులు, చివరకు 30 వేల అడుగుల వేగంతో పడిపోయినట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రికార్డింగ్స్‌, విమాన ట్రాకింగ్‌ సమాచారం వెల్లడిస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పైలట్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం వేగంగా కిందికి దిగుతున్న విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు తెలియజేశారు.

‘‘మేము నిమిషానికి 8 వేల అడుగుల వేగంతో కిందికి దిగుతున్నాం.. మేడే.. మేడే.. ఇప్పుడు నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో దిగిపోతున్నాం’’ అని పైలట్‌ హెచ్చరించారు. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమించింది. మేము అదుపు తప్పిన వేగంతో నిమిషానికి 20 వేల అడుగుల వేగంతో కిందికి దిగుతున్నామని పైలట్‌ తెలిపారు. చివరకు విమానం నేలను ఢీకొట్టబోతున్న విషయాన్ని గుర్తించి.. మేము భూమిని ఢీకొట్టబోతున్నాం అంటూ చివరి హెచ్చరిక చేశారు. కొద్దిసేపటికే విమానం కుడివైపునకు తీవ్రంగా ఒరిగి నేలను బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. విమానం కూలిన చోట రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు కార్లలో ప్రయాణిస్తున్న వారు చిత్రీకరించారు. విమానం కూలి పేలిపోయిన దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఇళ్లకు, రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు అతి సమీపంలో విమానం పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి సమీపంలోని మొబైల్‌ హోమ్‌ కమ్యూనిటీలో నివసిస్తున్న సుమారు 600 మందిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

ఇదీ చదవండి: ‘ఎన్నికల్లో ఓడితే..’ షాకిస్తున్న ట్రంప్‌ వ్యాఖ్యలు!

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)