Breaking News

అలర్ట్‌: యూపీలో భారీవర్షాలు.. ఉత్తరాఖండ్‌కు కొండచరియల ముప్పు

Published on Sat, 07/20/2024 - 10:16

దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలోకి రుతుపవనాలు ప్రవేశించి, 20 రోజులకు పైగా సమయం గడిచినా గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడికి పక్కనే ఉన్న తూర్పు యూపీలో ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతున్నదనేది ఇప్పుడు  తెలుసుకుందాం.

ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) చినుకులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండవచ్చు. శుక్రవారం నాటి ఉష్ణోగ్రత కంటే ఈరోజు రాజధానిలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదుకానున్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారాంతంలోగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని పోర్‌బందర్‌ ప్రాంతమంతా జలమయమైంది. జూలై 22 వరకు గుజరాత్‌ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)