Breaking News

సిరియాలో ఇజ్రాయెల్‌ దాడులు.. హెజ్‌బొల్లా కమాండర్‌ హతం

Published on Mon, 11/11/2024 - 08:17

సిరియాలోని డమాస్కస్‌కు దక్షిణంగా ఇరాన్ అనుకూల గ్రూపు హెజ్‌బొల్లాకు చెందిన అపార్ట్‌మెంట్‌పై  ఇజ్రయెల్‌ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన ఓ కమాండర్‌తో సహా తొమ్మిది మంది మరణించారని ఓ వార్‌ మానిటర్ వెల్లడించారు. లెబనీస్‌ పౌరసత్వం కలిగిన ఆ హెజొబొల్లా కమాండర్‌.. సిరియాలో కీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. 

సెప్టెంబరు 23న లెబనాన్‌లోని హిజ్‌బొల్లాతో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై దాడులను పెంచుతోంది. సిరియా రాజధానికి దక్షిణంగా ఉన్న సయ్యిదా జైనాబ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ ఇజ్రాయెల్‌ దాడి చేసింది. లెబనీస్ కుటుంబాలు, హెజ్‌బొల్లా సభ్యులు నివసించే అపార్ట్‌మెంట్‌ ఇజ్రాయెల్‌ సైన్యం దాడి చేయటంతో 14 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.  

‘‘ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చిన కమాండర్‌ సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతను లెబనీస్ జాతీయుడు. ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాకు చెందిన నలుగురు పౌరులు (ఒక మహిళ , ఆమె ముగ్గురు పిల్లలు), హిజ్‌బొల్లాల కమాండర్‌తో సహా మరో ఐదుగురు మృతి చెందారు. మృతి చెందిన కమాండర్‌ పేరు తెలియరాలేదు’’అని బ్రిటన్ ఆధారిత వార్‌ మానిటర్‌కు నాయకత్వం వహిస్తున్న రామి అబ్దేల్ రెహ్మాన్ వెల్లడించారు.  

మరోవైపు.. శనివారం ఉత్తర, వాయువ్య సిరియాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన ఐదుగురిలో నలుగురు ఇరాన్ అనుకూల ఫైటర్లు ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. సిరియాలో వందలాది దాడులకు పాల్పడింది.  హెజ్‌బొల్లా సైనిక స్థావరాలు, ఫైటర్ల లక్ష్యంగా దాడులు చేసింది. సిరియాలో ఇరాన్‌ తన ఉనికిని విస్తరించేందుకు  చేస్తున్న  ప్రయత్నాలను అనుమతించబోమని ఇజ్రాయెల్‌ స్పష్టం చేస్తూ వస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)