Breaking News

‘వాగ్నర్‌’ చీఫ్‌ ప్రిగోజిన్‌ ప్రాణాలకు ముప్పు

Published on Tue, 06/27/2023 - 06:09

వాషింగ్టన్‌:  రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రైవేట్‌ సైన్యం ‘వాగ్నర్‌’ చీఫ్‌ ప్రిగోజిన్‌ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ అధిపతి డేవిడ్‌ పేట్రాయస్‌ హెచ్చరించారు. తెరిచి ఉన్న కిటికీల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్‌కు సూచించారు. గతంలో పుతిన్‌ ప్రత్యర్థులు చాలామంది ఇలా తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడి మరణించారని పేట్రాయస్‌ పరోక్షంగా తెలియజేశారు.

తిరుగుబాటు చర్య నుంచి వెనక్కి తగ్గడం ద్వారా ప్రిగోజిన్‌ ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకున్నాడని, కానీ వాగ్నర్‌ గ్రూప్‌ను పోగొట్టుకున్నాడని అభిప్రాయపడ్డారు. రష్యా అధికార పీఠం పెత్తనాన్ని ప్రశ్నించినవారు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. సోవియట్‌ కూటమిలోనూ, ఆ తర్వాత రష్యాలోనూ ఇలాంటి మరణాలు సంభవించాయి. కిటికీల నుంచి కింద పడిపోయి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. తనపై తిరుగుబాటు చేసిన వారిని పుతిన్‌ అంత సులభంగా వదిలిపెట్టబోరని ఆయన గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. ప్రిగోజిన్‌ ప్రస్తుతం బెలారస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అక్కడ సురక్షితంగా ఉంటారా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)