Breaking News

రష్యా పైకి ‘ఆర్మీ ఆఫ్‌ యూరప్‌’

Published on Sun, 02/16/2025 - 05:13

మ్యూనిక్‌: యూరప్‌ ఖండానికి అవసరమైన సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదని అర్థమవుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యూరప్‌ దేశాలు రష్యా దురాక్రమణ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ‘ఆర్మీ ఆఫ్‌ యూరప్‌’ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. 

జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ మాట్లాడారు. తమ ప్రమేయం లేకుండా, తమకు తెలియకుండా చేసుకునే ఒప్పందాలను ఉక్రెయిన్‌ అంగీకరించబోదని ఆయన తేల్చి చెప్పారు. అదేవిధంగా, యూరప్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు యూరప్‌ దేశాలకు కూడా ఆ చర్చల్లో స్థానం కల్పించాలన్నారు.

 శాంతి చర్చలు ప్రారంభించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సిద్ధమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనపై ఆయనీ విధంగా వ్యాఖ్యానించారు. యూరప్, అమెరికాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం ఇక ముగిసినట్లేనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం సదస్సులో పేర్కొన్న విషయాన్ని జెలెన్‌స్కీ గుర్తు చేస్తూ..‘ఇప్పటి నుంచి కొత్త పరిణామాలు సంభవించనున్నాయి. వీటికి యూరప్‌ సమాయత్తం కావాల్సి ఉంది’అని అన్నారు.

 ‘ఇతర దేశాల నుంచి మనకు బెదిరింపులు ఎదురైతే తమకు సంబంధం లేదని అమెరికా తెగేసి చెప్పేందుకు అవకాశముందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అమెరికాపై ఆధారపడకుండా యూరప్‌ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలంటూ గతంలో ఎందరో నేతలు చెప్పారు. అవును, మనకిప్పుడు సైన్యం కావాలి. అదే ఆర్మీ ఆఫ్‌ యూరప్‌’అని ఆయన స్పష్టం చేశారు.ముఖాముఖి చర్చలకు అంగీకరించడం ద్వారా పుతిన్‌ అమెరికాను ఏకాకిగా మార్చారన్నారు. 
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)