Breaking News

కాల్పుల విరమణకు ఓకే కానీ..

Published on Fri, 03/14/2025 - 05:23

మాస్కో: నెలల తరబడి రక్తమోడుతున్న ఉక్రెయిన్‌ రణక్షేత్రాల్లో శాంతి పవనాలు వీయొచ్చనే ఆశలు రేకెత్తుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన ‘30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం’ సుసాధ్యమయ్యేలా ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యాఖ్యానించారు. మాస్కో నగరంలో గురువారం పత్రికా సమావేశంలో పుతిన్‌ మాట్లాడారు. ‘‘ తొలుత 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటూ అమెరికా చేస్తున్న ప్రతిపాదన అద్భుతంగా ఉంది. సబబైంది కూడా. 

ఈ ప్రతిపాదనకు మేం సూత్రప్రాయంగా, సైద్ధాంతికంగా అంగీకారం తెలుపుతున్నాం. అయితే యుద్ధంలో ఇంకా పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని చర్చించాలి’’ అని పుతిన్‌ అన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కోఫ్‌ మాస్కో నగరానికి గురువారం విచ్చేసిన వేళ కాల్పుల విరమణ ప్రతిపాదనకు పుతిన్‌ సానుకూలంగా స్పందించడం గమనార్హం. ‘‘అమెరికా మిత్రులు, సంబంధిత భాగస్వాములతో రష్యా ఈ విషయమై విస్తృతస్థాయిలో సమాలోచనలు చేయాల్సి ఉంది. 

ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడకుండా, ఉల్లంఘనలు జరక్కుండా చూసుకునే ఒక వ్యవస్థను తొలుత సిద్ధంచేయాలి. దీంతోపాటు ఈ 30 రోజుల కాల్పుల విరమణ సమయాన్ని ఉక్రెయిన్‌ దుర్వినియోగం చేయకుండా చూడాలి. అంటే ఈ 30 రోజుల్లో సరిహద్దులకు అదనపు బలగాలను మొహరించడం, మరింతగా ఆయుధాలను సమకూర్చుకోవడం వంటివి చేయకుండా నిరోధించాలి.

 యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలనే ప్రతిపాదనలను మేం అంగీకరిస్తాం. అయితే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి బాటలు వేయాలి. ఈ సంక్షోభానికి మూలాలను తొలగించగలగాలి. యుద్ధానికి శాశ్వతంగా తెరపడాలి’’ అని పుతిన్‌ అన్నారు. సంక్షోభానికి మూలకారణాలను రూపుమాపాలని పుతిన్‌ గతంలోనూ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ సారథ్యంలో కొలువుతీరిన ప్రభుత్వం సైతం సంక్షోభానికి కారణమని పుతిన్‌ గతంలో పరోక్షంగా అన్నారు. నాటో విస్తరణతోపాటు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదననూ పుతిన్‌ వ్యతిరేకిస్తున్నారు.

థాంక్యూ ట్రంప్‌
‘‘ఉక్రెయిన్‌ సమస్యకు పరిష్కారం వెతికేందుకు శతథా కృషిచేస్తూ, ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నా కృతజ్ఞతలు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు తమ వంతు కృషిచేస్తున్న చైనా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అగ్రనేతలకూ నా కృతజ్ఞతలు’’ అని పుతిన్‌ అన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)