Breaking News

విమాన ప్రయాణం.. మధ్యలో లేచి డబ్బులు కావాలంటూ

Published on Sat, 07/15/2023 - 12:10

కొన్ని కార్యక్రమాలకు విరాళాలు సేకరించడం మనకు తెలిసిన విషయమే. ఇలాంటివి సాధారణంగా రోడ్లపైనో లేదా బస్సుల్లో సేకరిస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా ఏకంగా విమానంలో విరాళాలు అడుగడం ప్రారంభించాడు. అయితే అతను నెట్టింట ఫేమ్‌ కోసం ఇలా చేశాడా లేదా నిజంగానే విరాళాల కోసం ఇలా చేశాడో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకి​స్తాన్‌లో చోటు చేసుకుంది.

పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడి ప్రజలకు రెండు పూటలా భోజనం తినడం కూడా కష్టంగా మారిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా..  ఓ పాకిస్తాన్‌ వ్యక్తి విమానంలో ప్రయాణిస్తుండగా.. సడన్‌గా లేచి విరాళాల కోసం ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘మేము మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీరు కూర్చున్న చోటుకు వస్తాను. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం చేయండి’ అంటూ అభ్యర్థించడం మొదలు పెట్టాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరో వైపు.. పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అటు ఐఎంఎఫ్‌తో పాటు స్నేహపూర్వక దేశాల నుంచి రుణాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ వీడియో వైరల్‌ అవడంతో దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.
 


చదవండి ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)