Breaking News

Video: తప్పించుకుని వచ్చిన పెంపుడు సింహం.. జనాలపై దాడి

Published on Fri, 07/04/2025 - 20:11

లాహోర్‌:  పెంపుడు జంతువుల్లో మనం ఎక్కువగా చూసేది కుక్క. ఈ మధ్య క్రూర మృగాలను కూడా పెంచుకుంటున్న వారు కూడా లేకపోలేదు. క్రూర మృగాలను పెంచుకుంటే ఏమౌతుందో తాజా ఘటనతో అద్దం పడుతోంది,. పాకిస్తాన్‌లో  ఓ కుటుంబం సింహాన్ని పెంచుకుంటుంది.  ఇది వారి రాయల్టీకీ సింబాలిక్‌ ఏమిటో గానీ, ఇప్పుడు అదే సింహం  ఇద్దరు చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. 

సదరు ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన సింహం.. వీధుల్లో పడింది. తొలుత  తప్పించుకున్న సింహం ఓ గొడపై మాటువేసి మరీ జనాలపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో లాహోర్‌లోని షా దీ కోయి ఏరియాలో చోటు చేసుకుంది.  ఇంటి నుంచి తప్పించుకున్న సింహం.. షాపింగ్‌ వెళుతున్న మహిళపై ముందుగా దాడికి దిగింది.  మహిళను వెంబడించి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో  ఇద్దరు చిన్నారులు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే తాము పెంచుకుంటున్న సింహం.. జనావాసాలపై దాడి చేసిందనే వార్త తెలియగానే ఆ ఇంటి యజమానులు అది చూసి ఆనందించినట్లు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.  ఈ ఘటన గురువారం రాత్రి జరిగితే, శుక్రవారం సింహాన్ని పెంచుకుంటున్న యజమానులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.  తొలుత వారు ఇంటి నుంచి పారిపోయారని,  కానీ 12 గంటల్లో వారిని అరెస్ట్‌ చేసినట్లు లాహోర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆపరేషన్స్‌  కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సింహం 11 నెలల మగ సింహమని, దాన్ని పట్టుకుని వైల్డ్‌ లైఫ్‌ పార్క్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

 

 

#

Tags : 1

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు