Breaking News

భూకంపం మిగిల్చిన విషాదం..3,889 మంది మృతి

Published on Fri, 07/10/2026 - 09:49

రెండు వారాల క్రితం వెనిజువెలాలో సంభివించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విధ్వంసం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 3,889కు చేరుకుంది. దాదాపు 17 వేల మందికి పైగా గాయాలయ్యాయి.భూకంపం వల్ల అతలాకుతలమైన వెనిజువెలా పునరుద్ధరణకు ఐక్యరాజ్య సమితి  నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.

జూన్ 24న సంభవించిన జంటనగరాలలో  7.2 మరియు 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించింది. నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన నివేదిక ప్రకారం..ఈ జంట భూకంపాల వల్ల దాదాపు 17,000 మంది గాయపడగా, మరో 18,000 మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశాల్లో స్తంభింపజేసిన  వెనిజులా నిధులను విడుదల చేయాలని తాత్కాలిక నాయకురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కోరారు.

అంతర్జాతీయ సహాయం, నష్టం వివరాలు
ఐక్యరాజ్యసమితి నిధుల సేకరణతో పాటు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద నిలిచిపోయిన తమ ఆర్థిక ఆస్తులను పునరుద్ధరించుకోవడానికి  చర్చలు జరుపుతోందని IMF ప్రతినిధి జూలీ కోజాక్ తెలిపారు. ఈ భూకంపం వల్ల అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న తీరప్రాంతం 'లా గుయైరా'లో 800 కంటే ఎక్కువ భవనాలు దెబ్బతినగా, 190 భవనాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి.

శకలాల కింద ఆశల వేట
విపత్తు జరిగి 15 రోజులు కావస్తుండటంతో రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతకడం ఆపేస్తున్నప్పటికీ, కొందరు కుటుంబ సభ్యులు మాత్రం తమ వారి కోసం ఆశలను వదులుకోలేదు. లా గుయైరా నగరంలోని 'ప్లాయా గ్రాండే'లో ఉన్న భారీ శకలాల కుప్పల కింద తన ఇద్దరు టీనేజ్ కుమారులు సమాధి అయి ఉన్న స్థలాన్ని తాను గుర్తించానని సిరో ఒక్యాండో అనే ఒక వ్యక్తి తెలిపారు. ఈ దశలో వారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసినప్పటికీ తన 13, 18ఏళ్ల కుమారుల మృతదేహాలనైనా తీసుకోవాలని తపనపడుతున్నట్లు పేర్కొన్నారు.

"నేను సరైన స్థలంలోనే వెతుకుతున్నాను, కానీ ఇక్కడ శకలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి" అని సొంతంగా చేతి పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ ఆయన మీడియాతో కన్నీటీ పర్యంతమవుతూ తెలిపారు. తన కుమారుల మృతదేహాల కోసం తండ్రి వెతకడం పలువురిని కంటతడికి గురి చేసింది.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)