Breaking News

‘సుల్తాన్‌పూర్ ప్రజల ‘అమ్మ‘కు మద్దతు ఇవ్వడానికి వచ్చా’

Published on Thu, 05/23/2024 - 15:19

లక్నో: దేశంలో కేవలం సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం ప్రజలు మాత్రమే తమ ఎంపీని ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారని బీజేపీ నేత వరుణ గాంధీ అన్నారు. వరుణ గాంధీ తన తల్లి మేనకా గాంధీ కోసం గురువారం సుల్తాన్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా వరుణ్‌ గాంధీ మాట్లాడారు.

‘‘దేశంలోనే ఒకే ఒక పార్లమెంట్‌ స్థానంలో అక్కడి ప్రజలంతా తమ ఎంపీని ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుస్తారు. నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ మేనకా గాంధీకి ప్రజలు మద్దలు ఇవ్వాలని కోరడానికి రాలేదు. సుల్తాన్‌పూర్‌ ప్రజల ‘అమ్మ’కు మద్దతు ఇవ్వాలని కోరటం కోసం వచ్చా’’ అని వరుణ్‌ గాంధీ అన్నారు.

మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయటం ఇది రెండోసారి. 2019 ఎన్నికల్లో ఆమె ఇక్కడ 14000 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈసారి భారీ​ మెజార్టీ సాధించటంపై బీజేపీ దృష్టి పెట్టింది. అందుకే యూపీ సీఎం  యోగి ఆదిత్యనాథ్‌ సైతం సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.  

ఇక.. ఫిలిబీత్ సిట్టింగ్‌ ఎంపీ అయిన వరుణ్‌ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే వరుణ్‌ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించటం వల్లనే బీజేపీ ఈసారి ఆయనకు టికెట్‌ ఇవ్వలేదని రాజకీయంగా పార్టీలో చర్చ జరుగుతోంది.

Videos

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)