Breaking News

భారత్‌కు వాన్స్‌ 

Published on Sat, 04/12/2025 - 04:35

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీసమేతంగా భారత్‌కు వస్తున్నారు. భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో కలిసి ఏప్రిల్‌ 21 నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారని సమాచారం. ఉషవి తెలుగు మూలాలున్న విషయం తెలిసిందే. అమెరికా సెకండ్‌ లేడీ హోదాలో ఆమె భారత్‌ రానుండటం ఇదే తొలిసారి. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడటం తెలిసిందే. 

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులతో వాన్స్‌ భేటీ కానున్నారు. వాణిజ్య తదితర రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా, భారత్‌ మధ్య కీలక ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముంది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌ కూడా ఏప్రిల్‌ 21–24 తేదీల్లోనే భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్‌ ఉన్నతస్థాయి చర్చల్లో ఆయన కూడా భాగస్వామి కానున్నారు.

తాజ్‌మహల్‌ సందర్శన 
భారత పర్యటన సందర్భంగా వాన్స్‌ దంపతులు తాజ్‌మహల్‌ను కూడా వీక్షించనున్నారు. ఆగ్రాతో పాటు జైపూర్‌ను కూడా వాళ్లు సందర్శిస్తారని తెలుస్తోంది.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)