Breaking News

‘వెల్‌కమ్‌ బ్యాక్‌ ట్రంప్‌’.. బైడెన్‌తో భేటీ

Published on Thu, 11/14/2024 - 04:13

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అనంతరం డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం తొలిసారి వాషింగ్టన్‌లో అడుగు పెట్టారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఓవర్‌ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రాథమిక అంశాలు వారి నడుమ చర్చకు వచ్చినట్టు సమాచారం. 

తన భార్య, ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌తో కలిసి ‘వెల్‌కం బ్యాక్‌’ అంటూ ట్రంప్‌ను బైడెన్‌ స్వాగతించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు. అనంతరం నేతలిద్దరూ కరచాలనం చేసుకున్నారు. ‘‘రాజకీయా లు కఠినమైన వ్యవహారం. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

మెలానియా డుమ్మా
బైడెన్‌తో ట్రంప్‌ భేటీకి ఆయన భార్య మెలానియా డుమ్మా కొట్టారు. ట్రంప్‌పై నమోదైన రహస్య పత్రాల కేసులో బైడెన్‌ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతోనే ఈ సమావేశానికి ఆమె దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్లోరిడా నివాసంలో సోదాల సందర్భంగా మెలానియా వార్డ్‌ రోబ్‌ను అధికారులు అణువణువూ శోధించారు. ఆ క్రమంలో ఆమె లో దుస్తులున్న షెల్ఫ్‌ను కూడా వదిలి పెట్టలేదు. మెలానియా భేటీకి రాకున్నా ఆమెకు జిల్‌ అభినందన లేఖ రాశారు. దాన్ని ట్రంప్‌కు స్వయంగా        అందజేశారు. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)