Breaking News

USA Presidential Elections 2024: అమెరికాకు అర్హుడైన ఉపాధ్యక్షుడు

Published on Thu, 08/08/2024 - 06:10

ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కమలా హారిస్‌ ప్రచారం ముమ్మరం చేశారు.  మంగళవారం పెన్సిల్వేనియాలో భారీ ప్రచార సభలో మాట్లాడారు. తన ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌ వాల్జ్‌ను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును వివరించారు. ఆయన కేవలం గవర్నర్‌ మాత్రమే కాదు, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. 

అమెరికా ప్రగతి కోసం, ప్రజల సౌభాగ్యం కోసం తాము కలిసి పని చేయబోతున్నామని వెల్లడించారు. అమెరికాకు అన్నివిధాలా అర్హుడైన ఉపాధ్యక్షుడు టిమ్‌ వాల్జ్‌ అని ప్రశంసించారు. కమలా హారిస్‌ మాట్లాడిన అనంతరం టిమ్‌ వాల్జ్‌ ప్రసంగం ప్రారంభించారు. జనం చప్పట్లు, కేకలతో హర్షామోదాలు వ్యక్తం చేశారు. మనకు మరో 91 రోజులపాటు సమయం మాత్రమే ఉందని, ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 

అవిశ్రాంతంగా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మరణించిన తర్వాతే మనకు నిద్ర అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏబీసీ న్యూస్‌ సర్వేలో ఆసక్తికరమైన అంశం బయటపడింది. వాల్జ్‌ ఎవరో తమకు ఇప్పటిదాకా పెద్దగా తెలియదని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ఉపాధ్యక్ష అభ్యరి్థగా పేరు ఖరారైన తర్వాతే ఆయనెవరో తెలిసిందని అన్నారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)