Breaking News

స్థిరత్వం లేని ట్రంప్‌ను ఓడించండి

Published on Thu, 10/31/2024 - 05:14

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్‌ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్‌ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్‌ మాట్లాడారు. 

అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్‌ విజ్ఞప్తి చేశారు. 

ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు.

 అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్‌ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు.  

అధ్యక్షుడిగా పనికిరారు.. ట్రంప్ను ఓడించండి..

నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్‌
బైడెన్‌ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలు
వాషింగ్టన్‌: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్‌ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)