Breaking News

USA Presidential Elections 2024: బైడెన్‌ కంటే కమల బెటర్‌

Published on Sat, 07/20/2024 - 04:50

వాషింగ్టన్‌: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్‌పై ఒత్తిళ్లు తీవ్రమవుతున్న వేళ ఆయన కంటే కమలా హారిస్‌ మంచి అధ్యక్షురాలు అవుతారని మెజారిటీ డెమొక్రాట్లు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమొక్రాటిక్‌ పార్టీ సభ్యుల్లో ఆరుగురు కమలా హారిస్‌ అగ్ర రాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆమె సామర్థ్యంపై అపనమ్మకం వెలిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని, తమకు అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. ఏపీ–ఎన్‌ఓఆర్‌సీ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఆఫైర్స్‌ రీసెర్చ్‌ నిర్వహించిన పోల్‌లో డెమొక్రాట్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

 ట్రంప్‌తో జూన్‌ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చలో  బైడెన్‌ తడబడటం, మతిమరపుతో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ట్రంప్‌ను ఓడించాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్‌ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్థి కావాలని డెమొక్రాట్లు డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ.. బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అధ్యక్ష అభ్యరి్థగా వైదొలగడమే పారీ్టకి మేలని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. బైడెన్‌ కొనసాగితే వైట్‌హౌస్‌ను కోల్పోవడమే కాకుండా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ డెమొక్రాటిక్‌ పారీ్టకి ఎదురుదెబ్బ తగులుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.  

వైదొలగడం లేదు: ప్రచార సారథి 
జో బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం లేదని ఆయన ప్రచారబృందం సారథి జెన్‌ ఒమాలీ డిల్లాన్‌ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే బైడెన్‌కు మద్దతు తగ్గుతున్న విషయాన్ని అంగీకరించారు. ‘ఆయనకు 81 ఏళ్లనేది నిజమే.. కానీ ఆయన గెలవగలరని అమెరికా ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుకొల్పడానికి మేము చేయాల్సింది ఎంతో ఉంది’ అని డిల్లాన్‌ అన్నారు. బైడెన్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ ఓటర్లు ట్రంప్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపడం లేదని ఆమె పేర్కొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి