Breaking News

Trump Vs Kamala: ఎన్నికల సర్వేల్లో సూపర్‌ ట్విస్ట్‌

Published on Sun, 07/28/2024 - 07:46

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల వేళ అగ్ర రాజ్యం అమెరికా రాజకీయం ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారీస్‌ పోటీ నిలుస్తున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్‌ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. కాగా, ఆమె రేసులో వచ్చిన వెంటనే ట్రంప్‌ గ్రాఫ్‌ క్రమంగా పడిపోతోంది. ఎన్నికల​ సర్వేల్లో కమలా హారీస్‌ దూసుకుపోతున్నారు.

వివరాల ప్రకారం..  రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో సమానంగా కమల హారీస్‌ ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌– సియానా కాలేజ్‌ తాజా పోల్స్‌లో వెల్లడించింది. ఇక, సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్‌ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారీస్‌కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్‌పై ట్రంప్‌ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారీస్‌ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్‌ ఓటర్లలో ట్రంప్‌కు 48 శాతం, హారీస్‌కు 46 శాతం మద్దతు లభించింది.  

ఇదిలా ఉండగా.. రిపబ్లికన్లలో ట్రంప్‌ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్‌కు సైతం డెమోక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారీస్‌కు మాత్రం ఈ వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్‌ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్‌కు 60 శాతం మద్దతు లభించింది.

మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హరీస్‌ వచ్చిన వెంటనే ఆమెకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. అంతకుముందు జరిపిన ఓ ఎన్నికల సర్వేలో కూడా ట్రంప్‌ కంటే కమలా హారీస్‌ ముందంజలోనే ఉన్నారు. దాదాపు రెండు శాతం ఓట్లతో కమలా దూసుకెళ్లారు. దీంతో, రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనంటూ డెమోక్రాట్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలో కూడా నేతల నుంచి హారీస్‌కు పూర్తి మద్దతు లభించడం విశేషం. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)