Breaking News

ప్రాణాలు కాపాడిన వాచ్‌ 

Published on Fri, 07/31/2026 - 05:55

అవును! మీరు చదివింది నిజమే. ఆపిల్‌ వాచ్‌ అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అతని వాచ్‌లోని ‘ఫాల్‌ డిటెక్షన్‌’ఫీచర్‌ ఆటోమేటిక్‌గా పనిచేసి ఎమర్జెన్సీకి కాల్‌ చేసి అతనికి సరైన సమయంలో వైద్యం అందేలా చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.. ఒహాయోకు చెందిన మహమ్మద్‌ ఇస్లాం అనారోగ్యంగా అనిపించడంతో ఆఫీసులో సెలవు తీసుకుని ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెవి దగ్గర నొప్పి, నడవడం కూడా కష్టంగా అనిపించింది. అయినా, ఇంట్లో చెత్తను పడేయడానికి బయటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 

అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు.. స్పృహ వచ్చేసరికి విపరీతమైన చెమటలు. అతికష్టం మీద లేచి పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని కూర్చున్నాడు. ఇంతలో అంబులెన్స్‌ సైరన్‌ శబ్దం. తాను కింద పడటాన్ని గుర్తించిన ఆపిల్‌ వాచ్‌ అత్యవసర సేవలకు కాల్‌ చేసిందని గ్రహించాడు. వెంటనే సిన్సినాటి విశ్వవిద్యాలయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిందని వైద్యులు గుర్తించారు. తాను బతికి ఉన్నానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటున్నాడు. తన చేతి ఆపిల్‌ వాచ్‌లో ఫాల్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఎలా పనిచేసిందో చెబుతున్నాడు.  

వాచ్‌ ఏం చేసింది? 
అతను గట్టిగా కింద పడటాన్ని వాచ్‌ గ్రహించింది. మణికట్టును తట్టి, అలారం మోగించి, ‘ఆర్‌ యూ ఓకే’అని అడుగుతూ ఒక హెచ్చరికను ప్రదర్శిస్తుంది. వాచ్‌ ధరించిన వ్యక్తి కదులుతూ ఉంటే, స్పందించే వరకు వేచి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి సుమారు ఒక నిమిషం పాటు కదలకుండా ఉన్నారని గుర్తిస్తే, 30–సెకన్ల కౌంట్‌డౌన్‌తో మణికట్టును తడుతూ క్రమంగా, బిగ్గరగా హెచ్చరికను మోగిస్తుంది. కౌంట్‌డౌన్‌ ముగిసినా ఎలాంటి స్పందన రాకపోతే, వాచ్‌ స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్‌ చేస్తుంది. ఖచ్చితమైన లొకేషన్‌ను కూడా షేర్‌ చేస్తుంది. వ్యక్తి కింద పడిపోయాడని గుర్తించినట్లు అత్యవసర కాంటాక్ట్‌లకు సందేశం పంపుతుంది. ఈ ఫీచర్‌ 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. 18 నుంచి 54 ఏళ్ల మధ్య వయస్సున్నవారైతే మాన్యువల్‌గా ఆన్‌ చేసుకోవచ్చు. మహమ్మద్‌ ఇస్లాం విషయంలోనూ ఇదే జరిగింది. ఫోన్‌ ఎమర్జెన్సీకి కాల్‌ చేసింది. ఈ లోపు అతనికి స్పృహ రావడం ఇంకా మంచిదైంది.                    –సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)