USA: ఆంటోనీ బ్లింకెన్ చివరి సమావేశంలో రసాభాస(వీడియో)

Published on Sat, 01/18/2025 - 08:55

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ నిర్వహించిన చివరి విలేకరుల సమావేశంలో గందరగోళం నెలకొంది. గాజా వివాదంపై బైడెన్ పరిపాలన విధానాలను ఆయన సమర్థిస్తున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాజా యుద్ధాన్ని కవర్‌ చేసిన జర్నలిస్టు బ్లింకెన్‌ను విమర్శించారు. దీంతో, వారిని సమావేశం నుంచి బయటకు లాకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాలో విదేశాంగ శాఖలో ఆంటోనీ బ్లింకెన్ నిర్వహించిన చివరి సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. సమావేశంలో భాగంగా బ్లింకెన్‌ మాట్లాడుతూ.. బైడెన్‌ నిర్ణయాలను సమర్ధించారు. బైడెన్‌ మంచి పరిపాలన అందించారని అన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌, గాజా విషయంలో బైడెన్‌ చొరవతోనే కాల్పులు విరమణ ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ సమయంలో గాజా యుద్ధాన్ని కవర్‌ చేసిన జర్నలిస్టు సామ్‌ హుస్సేనీ.. బ్లింకెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ క్రమంలో జర్నలిస్టులు.. గాజా మారణహోమానికి మంత్రివి అంటూ ఘాటు విమర్శలు చేశారు. బైడెన్‌ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ మొదలు అంతర్జాతీయ నేర న్యాయస్థానం దాకా ఇజ్రాయెల్‌ నరమేధం జరుపుతోందని, నాశనం చేస్తోందని చెప్పాయి. మీరు ఆ ప్రక్రియను గౌరవించమని చెబుతున్నారు. గాజా విషయంలో ఇన్ని రోజులు మారణహోమం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు అంటూ ప్రశ్నలు సంధించారు. మీరంతా నేరస్థులు. జర్నలిస్టుల చావులకు మీరే కారణం. మీరు ఎందుకు అంతర్జాతీయ న్యాయస్థానం దిహేగ్‌లో ఉండకూడదు అంటూ విమర్శించారు. 

దీంతో, బ్లింకెన్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం.. సమావేశంలో ఉన్న సిబ్బంది సదరు జర్నలిస్టులను అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్‌ నినాదాలు చేశారు. గాజా మారణహోమానికి మంత్రి బ్లింకెన్‌ అంటూ నినాదం చేశారు. దీంతో, సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)