Breaking News

భారతీయ శాకాహార వంటకాలు భేష్‌: జేడీ వాన్స్‌

Published on Mon, 11/11/2024 - 10:15

వాషింగ్టన్‌: అమెరికా నూతన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జేడీ వాన్స్‌ భారతీయ శాకాహార వంటకాలపై ప్రశంసలు గుప్పించారు. తనకు భారతీయ శాకాహార వంటకాల రుచులను చూపించిన ఘనత తన భార్య ఉషా వాన్స్‌కి దక్కుతుందన్నారు. తామిద్దం డేటింగ్‌లో ఉన్నప్పుడు ఉష తన కోసం వండిన మొదటి శాఖాహార భోజనం గురించి  జేడీవాన్స్‌ మీడియాకు తెలిపారు.

‘జో రోగన్ ఎక్స్‌పీరియన్స్’ కార్యక్రమంలో వాన్స్ తన ఆహార అభిరుచులు తన భార్య ఉష కారణంగా ఎలా  మారాయో తెలిపారు. ప్రత్యేకించి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా  ఉంటూ, శాకాహార వంటల వైపు మళ్లానని తెలిపారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలపై జో రోగన్  చేసిన విమర్శతో ఈ చర్చ ప్రారంభమైంది.  ప్రాసెస్ చేసిన ఆహారాలను రోగర్‌.. చెత్త అని పేర్కొన్నాడు.  ఇటీవలి కాలంలో మొక్కల ఆధారిత ఆహారాలను అలవాటు చేసుకున్న వాన్స్ ఈ మాటను హృదయపూర్వకంగా అంగీకరించారు.

ఎవరైనా సరే కూరగాయలను సరిగా తినాలనుకుంటే, అలాగే శాఖాహారిగా ఉండాలనుకుంటే భారతీయ ఆహారాలను తినండి అంటూ రోగన్  సలహా ఇచ్చిన దరిమిలా వాన్స్ దీనిని అంగీకరిస్తూ, తన భార్య నేపథ్యం, ఆమె వంటకాలు.. వాటితో తన జీవన విధానం ఎలా మారిందో తెలిపారు. తాను ఉషా వాన్స్‌ని కలవడానికి ముందు భారతీయ వంటకాలపై తనకు ప్రాథమిక అవగాహన మాత్రమే ఉందని  వాన్స్‌ తెలిపారు. తన భార్య  భారతీయ-అమెరికన్ అని, ఆమె చేసే శాఖాహార వంటలు అద్భుతంగా ఉంటాయని వాన్స్‌ పేర్కొన్నారు.

శాకాహార జీవనశైలిని స్వీకరించాలనుకునువారు భారతీయ వంటకాల వైపు  మళ్లండి. శాకాహారంలో పలు ఎంపికలు ఉంటాయి. నకిలీ మాంసాన్ని తినడం మానివేయండి అని వాన్స్‌ అన్నారు. వాన్స్‌ తన భార్య ఉషాతో డేటింగ్ చేసిన తొలిరోజుల నాటి ఊసులను కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తాను తన ఇంట్లో తయారుచేసిన శాఖాహార భోజనంతో  ఉషను ఆకట్టుకునేందుకు ప్రయత్నించానని వాన్స్‌ తెలిపారు. పిజ్జా రోల్స్‌పై పచ్చి బ్రోకలీని ఉంచి, దానిపై  మరిన్ని మసాలాలు జల్లి ఓవెన్‌లో 45 నిమిషాలు ఉంచి, శాఖాహార పిజ్జాను తయారు చేశానని,అయితే అది అత్యంత అసహ్యకరంగా తయారయ్యిందని వాన్స్‌ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.  

శాకాహార భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తనకు కాస్త సమయం పట్టిందని వాన్స్‌ తెలిపారు. తన భార్య ఉష కారణంగా భారతీయ వంటకాల రుచులను చూశాక అవి ఎంత గొప్పగా, రుచిగా వైవిధ్యంగా ఉంటాయో గ్రహించానని, భారతీయ శాకాహార ఆహారాన్ని మనేదానితోనూ పోల్చలేమని వాన్స్‌ పేర్కొన్నారు. భారతీయ శాకాహారం గొప్పదనం తెలుసుకున్నాక తాను శాకాహారిగా మారానని తెలిపారు. కాగా తాను తన తల్లి నుంచి శాకాహర వంటకాలను తయారు చేయడాన్ని నేర్చుకున్నానని ఉషా వాన్స్ ఆ మధ్య మీడియాకు తెలిపారు. 

ఇది కూడా చదవండి: అమెరికాలో... భారతీయ జానపద కథలకు జీవం 
 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)