ప్రిన్సిపాల్‌ ఎదుట డాన్స్.. ఊహించని షాక్‌.. డిగ్రీ గోవిందా!

Published on Mon, 06/19/2023 - 13:54

అమెరికా: అమెరికాలో ఒక హై స్కూల్లో స్టేజి మీద డాన్స్ చేసినందుకు ఓ విద్యార్థినికి డిప్లొమా పట్టా ఇవ్వడానికి నిరాకరించారు ఆ స్కూలు ప్రిన్సిపాల్. దీంతో ఇన్నేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసినట్టయ్యిందని ఆ విద్యార్థిని తోపాటు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. 

జూన్ 9న ఫిలడెల్ఫియా బాలికల హై స్కూల్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు డిగ్రీలు స్వీకరిస్తున్న సమయంలో ఎలాంటి గోల, అరుపులు చేయవద్దని.. కనీసం చప్పట్లు కూడా కొట్టవద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది స్కూల్ యాజమాన్యం. దీంతో నిశ్శబ్ద వాతావరణంలో పట్టా ప్రదానోత్సవం జరుగుతుండగా హఫ్సా అబ్దుల్ రహ్మాన్ అనే అమ్మాయి తన పేరు పిలవగానే స్టేజి మీదకు వచ్చింది. కానీ డిగ్రీ పట్టా  సాధిస్తున్నానన్న సంతోషంలో ఉండబట్టలేక చిన్నగా చిందేసింది. అదికాస్తా ప్రిన్సిపాల్ దృష్టిలో పడేసరికి ఆమెకు పట్టా అందివ్వలేదు సరికదా మర్యాదగా స్టేజి విడిచి వెళ్ళమని ఆదేశించారు. 

దీంతో స్టేజి విడిచి వెళ్లిన హఫ్సా అబ్దుల్ రహ్మాన్ ప్రిన్సిపాల్ పట్టా అందివ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. నేనే తప్పూ చేయలేదు, ఏ నిబంధనను అతిక్రమించలేదని తెలిపింది. ఇదే స్నాతకోత్సవంలో హఫ్సా తనతో పాటు 2014లో కాల్పుల్లో చనిపోయిన తన సోదరి ఐషా తరపున కూడా డిగ్రీ పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమెను స్టేజి విడిచి వెళ్ళమనడంతో బోరున ఏడ్చేసింది. 

హఫ్సా తల్లి మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు కోవిడ్ సమయంలో మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని చదువుకున్నారని. ప్రిన్సిపాల్ ఇలా చేయడం అమానుషమని అన్నారు.        

ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం.. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)