Breaking News

చైనాకు షాక్.. తైవాన్‌తో యుఎస్ భారీ డీల్

Published on Sat, 12/20/2025 - 19:08

చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోన్న వేళ వాషింగ్టన్, డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది. తైవాన్‌తో 11బిలియన్ డాలర్ల భారీ డీల్ చేసుకుంది. ఒక ద్వీపానికి ఇంత పెద్దమెుత్తంలో ఆయుధాలు అమ్మడం యూఎస్ చరిత్రలో ఇదే తొలిసారని ఆదేశ వర్గాలు తెలిపాయి. ఈడీల్‌తో చైనా-యుఎస్ మధ్య సంబంధాలు మరోసారి భగ్గుమనే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్నారు. 
 

డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ సమయంలో పన్నులు పెంచుతాడో తెలియక ప్రపంచ దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో డ్రాగన్‌ కంట్రీతో ట్రేడ్‌ వార్‌కు దిగారు.  ఈ పన్నుల యుద్ధం కొంత తగ్గి ఇప్పుడిప్పుడే రెండు దేశాల బంధాలు కొలిక్కి వస్తన్నాయనే తరుణంలో ట్రంప్ మరో బాంబు పేల్చారు.

చైనా తమ భూభాగంగా ప్రకటిస్తున్న తైవాన్‌తో, అమెరికా,  11 బిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రి అమ్మకానికి ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌లో ఆధునాతన రాకెట్ సిస్టమ్స్, యాంటీ టాంక్ మిస్సైల్స్, డ్రోన్స్‌ లాంటి అధునాతన ఆయుధ సామాగ్రి ఉన్నట్లు పెంటగాన్ ప్రకటించింది. తైవాన్ తన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ ఒప్పందం ఎంతగానో సహకరిస్తుందని యుఎస్ తెలిపింది.

ఈ భారీ ఒప్పందంపై తైవాన్ స్పందించింది. తమకు ఇంత భారీ మెుత్తంలో ఆయుధ సరఫరా చేస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలని తైవాన్ అధికారులు తెలిపారు. తన జాతీయ భద్రతను కాపాడడంలో ఎటువంటి రాజీపడేది లేదని వారు ప్రకటించారు. ఇటీవలే ఆయుధ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి 40 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ ప్రకటించినట్లు తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని చైనా ఖండించింది. ఈ ఆయుధాల ఒప్పందంతో  తైవాన్‌లో శాంతి, స్థిరత్వం దెబ్బతింటాయని తెలిపింది.

చైనా దేశం తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమే అని ఆరోపిస్తుంది. అయితే తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర పరిపాలన ప్రాంతంగా ప్రకటించుకుంటుంది. ఈ నేపథ్యంలో తరచుగా వివాదం చెలరేగుతుంది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)