జీవుల కోసం ‘సూపర్‌ ఎర్త్‌’ 

Published on Sat, 10/25/2025 - 05:13

వాషింగ్టన్‌: గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా? మనం ఉంటున్న భూగోళంపై కాకుండా ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉందా? ఈ ప్రశ్నలకు ఇప్పటిదాకా కచి్చతమైన సమాధానం లేదు. అయితే, జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కలిగిన ఒక కొత్త గ్రహాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు గుర్తించారు. అంతర్జాతీయ పరిశోధకుల బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది. 

భూమి నుంచి దాదాపు 18 కాంతి సంవత్సరాల దూరంలోని ఈ గ్రహానికి ‘జీజే 251సీ’ అని పేరుపెట్టారు. అంతేకాకుండా దీన్ని ‘సూపర్‌ ఎర్త్‌’గా పరిగణిస్తున్నారు. ఇది మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం. మనం నివసిస్తున్న భూగ్రహం కంటే నాలుగురెట్లు పెద్దది కావడం విశేషం. అక్కడ అధికంగా రాళ్లు రప్పలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే అది ‘రాకీ ప్లానెట్‌’ అని చెప్పుకోవచ్చు. ఈ సూపర్‌ ఎర్త్‌ను గుర్తించడం ఈ ఏడాది ఖగోళ పరిశోధనల్లో అతిపెద్ద మలుపుగా చెబుతున్నారు. 

ఈ పరిశోధన వివరాలను అ్రస్టానామికల్‌ జర్నల్‌లో ప్రచురించారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్లుగానే జీజే251సీ గ్రహం గోల్డిలాక్స్‌ జోన్‌లో తన నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ గ్రహం ఉపరితలంపై ద్రవ రూపంలో నీరు ఉండేందుకు అనుకూల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. జీవుల ఆవాసం కోసం అనుకూలమైన ఇలాంటి గ్రహం కోసమే చాలాకాలంగా అన్వేíÙస్తున్నామని పెన్సిల్వేనియా వర్సిటీ సైంటిస్టులు చెప్పారు. 

రెండు దశాబ్దాలుగా ఈ పరిశోధన కొనసాగుతుండడం విశేషం. ఇందుకోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలు ఉపయోగిస్తున్నారు. సూపర్‌ ఎర్త్‌పై వాతావరణాన్ని క్షుణ్నంగా పరిశోధించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఆక్సిజన్‌ లేదా మీథేన్‌ వంటి వాయువులు ఉండొచ్చని భావిస్తున్నారు. మరో గ్రహంపై లేదా మన సౌర వ్యవస్థ బయట జీవం ఉనికి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది చరిత్ర గతినే మార్చేస్తుందనడంలో సందేహం లేదు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)