Breaking News

మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్‌లో పుడ్ ఫ్రీ, ఫ్రీ!

Published on Sun, 05/28/2023 - 17:48

ఆఫర్లంటే ఇష్టపడని వారుండరు. అందుకే కంపెనీలు, రెస్టారెంట్లు సైతం డిస్కౌంట్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. ఓ రెస్టారెంట్‌ యజమాని వినూత్నమైన ఆఫర్‌తో కస్టమర్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఇలాంటి ఆఫర్‌ ప్రకటించినందుకు కొంత మంది తిట్టుకుంటున్నారు కూడా. అసలు ఈ రెస్టారెంట్‌ కథేంటంటే... అమెరికాలో హార్ట్‌ ఎటాక్ గ్రిల్ అనే రెస్టారెంట్‌ ఉంది. హాస్పిటల్-థీమ్ సర్వీస్ కారణంగా ఈ రెస్టారెంట్‌ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో వెళ్లి చూస్తే అచ్చం ఆసుపత్రిలానే ఉంటుంది.

అంతేకాకుండా ఇందులో వంట చేసేవాళ్లు, వ‌డ్డించేవారు డాక్ట‌ర్లు, న‌ర్సుల్లా తెల్లకోటు ధరించి ఉంటారు. మ‌గ‌వారైతే డాక్ట‌ర్లుగా, ఆడవారు న‌ర్సుల్లా ప‌నిచేస్తుంటారు. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ రెస్టారెంట్‌లో తినాలనుకుంటే క‌స్ట‌మ‌ర్లు సైతం పేషంట్ల‌లా త‌యార‌వ్వాలి. హార్ట్ ఎటాక్ గ్రిల్‌లోని మెనూలోకి వస్తే, ఇందులో కూడా క్వాడ్రపుల్ బైపాస్ బర్గర్‌ల వంటి పేర్లుతో కనిపిస్తాయి.  ఇటీవల ఈ రెస్టారెంట్‌ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది

158 కిలోల కంటే ఎక్కువ బ‌రువు ఉన్న‌వారికి ఉచితంగా రుచిక‌రమైన ఆహారాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఇంకేముందు లావుగా ఉన్నవాళ్లు డైటింగ్‌ పక్కన పెట్టి ఇందులో ఈటింగ్‌ మొదలుపెట్టారు. బంఫర్‌ ఆఫ‌ర్‌ను వ‌దులుకోలేక ఆమ ఆరోగ్యాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా రెస్టారెంట్‌కి వెళ్లి లాగించేస్తున్నారు.ఈ తరహా ఆఫర్లను ఇవ్వడమంటే అది ఊబకాయాన్ని ప్రోత్సహించడమేనని కొందరు భావించారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌తో ఆడుకుంటూ వారి జీవితాల‌ను రిస్క్‌లో పెడుతున్న ఈ రెస్టారెంట్‌ను మూసివేయాల‌ని ట్విట‌ర్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  దీంతో నెట్టింట ఈ రెస్టారెంట్‌పై ట్రోల్స్‌ విపరీతంగా పెరిగాయి. ఇంత జరుగుతన్నా  ఈ రెస్టారెంట్‌ కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్‌, వైఫై సిగ్నల్స్‌ వస్తాయ్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)