Breaking News

డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో షాక్‌

Published on Sat, 12/30/2023 - 05:11

పోర్ట్‌ల్యాండ్‌:  అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో షాక్‌ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు దారులు క్రమంగా మూసుకుపోతున్నాయి. కొలరాడో రాష్ట్రంలో అధ్యక్ష అభ్యరి్థత్వానికి(ప్రైమరీ ఎన్నికలో) పోటీ చేసేందుకు ట్రంప్‌ అనర్హుడని 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్‌ హిల్‌పై దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

కొలరాడో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. తాజాగా మెనె రాష్ట్రంలోనూ ట్రంప్‌నకు పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా బ్యాలెట్‌ నుంచి ట్రంప్‌ పేరును తొలగిస్తున్నట్లు మెనె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెన్నా బెల్లోస్‌ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ట్రంప్‌నకు కలి్పంచారు.

కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెనె రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో ట్రంప్‌ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అప్పీళ్లు దాఖలు చేశారు. ఆయనకు ఇక్కడి నుంచి ప్రైమరీలో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న షెన్నా బెల్లోస్‌ ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి ట్రంప్‌ పేరును తొలగించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థి పేరును ఒక రాష్ట్రంలో ఇలా బ్యాలెట్‌ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు