Breaking News

జెలెన్‌స్కీ నుంచి ముఖ్యసందేశం వచ్చింది: ట్రంప్‌

Published on Wed, 03/05/2025 - 10:25

వాషింగ్టన్‌: అమెరికన్‌ కాంగ్రెస్‌ తొలిసారి ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump).. మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పంపిన ముఖ్యమైన సందేశాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్‌ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేసినట్లు ట్రంప్‌  ఆ లేఖను చదివి వినిపించారు.

అమెరికా కల పునరుద్ధరణ పేరిట మంగళవారం అమెరికా కాంగ్రెస్‌(US Congress)లో ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడి హోదాలో ట్రంప్‌ తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం టారిఫ్‌ అంశంతో పాటు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేతపైనా స్పందించారు. 

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy)తో  వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్‌ ఆఫీస్‌లోట్రంప్‌ జరిపిన  చర్చలు విఫలమైన నేపథ్యం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌(JD Vance)లు జెలెన్‌స్కీ తీరుపై కెమెరాల సాక్షిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే జెలెన్‌స్కీ  వెనుదిగారు. ఆ వెంటనే తన తీరును సమర్థించుకుంటూ సోషల్‌ మీడియాలో  పోస్టులు చేశారు.  ఈ క్రమంలో.. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి. ఆ వెంటనే ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారాయన.

దీంతో కొన్ని గంటల్లోనే జెలెన్‌స్కీ దిగివచ్చారు. ట్రంప్‌తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనన్నారు. ట్రంప్‌ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)