Breaking News

ట్రంప్‌ కార్డ్‌ దరఖాస్తులు షురూ

Published on Fri, 06/13/2025 - 03:50

వాషింగ్టన్‌: సంపన్న వలసదారుల కోసం తెచ్చిన శాశ్వత వీసా పథకం ‘ట్రంప్‌ కార్డ్‌’దరఖాస్తులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికారు. గోల్డ్‌కార్డ్‌గా పిలిచే ఈ దీని కొనుగోలు కోసం trumpcard.gov వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపవచ్చని ట్రంప్‌ ప్రకటించారు. 50 లక్షల డాలర్లతో ఈ కార్డును కొనుగోలు చేయవచ్చని ట్రూత్‌ సోషల్‌లో అధ్యక్షుడు వెల్లడించారు. 

‘‘ప్రపంచంలోనే గొప్ప దేశమైన అమెరికాలో అడుగు పెట్టడానికి, ఇక్కడ జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. వేలాది మంది కాల్‌ చేస్తున్నారు’’అని పేర్కొన్నారు. అయితే గోల్డ్‌ కార్డ్‌ అమెరికా పౌరసత్వానికి హామీ ఇవ్వదని, నివాసానికి అవకాశం మాత్రమే కల్పిస్తుందని ఆయన సూచించారు. ‘‘ఈ కార్డు పౌరసత్వం ఇవ్వదు. కనుక దీనికి కాంగ్రెస్‌ ఆమోదం అవసరం లేదు’’అని ట్రంప్‌ తెలిపారు. 

అమెరికా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాలనుకునే భారతీయులకు, ఇతర విదేశీయులకు గోల్డ్‌ కార్డు దారి చూపుతుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ ఇటీవల ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా 1990లో అమెరికా ఈబీ–5 వీసాలను ప్రవేశపెట్టింది. 

కనీసం 10 మందికి ఉపాధి కల్పిoచే కంపెనీలో 10 లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే ఈ శాశ్వత వీసాలు లభించేవి. వాటి స్థానంలో గోల్డ్‌ కార్డ్‌ తేనున్నట్టు ట్రంప్‌ ఫిబ్రవరిలో ప్రకటించారు. గతంలోలా ఈ వీసాలకు ఉద్యోగాల కల్పన తప్పనిసరి చేయలేదు. ఈబీ–5 వీ వీసాల్లో జరుగుతున్న మోసాన్ని అరికట్టడానికే కొత్త కార్డు తీసుకొస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల గోల్డ్‌ కార్డులను జారీ చేయాలని ట్రంప్‌ సర్కారు భావిస్తోంది.

గోల్డ్‌ కార్డ్‌ నిబంధనలు
» శాశ్వత నివాసం పొందాలంటే కార్డు తీసుకున్న అనంతరం ఐదేళ్లు అమెరికాలోనే ఉండాల్సి ఉంటుంది. 
»   18 ఏళ్లు నిండి ఉండాలి 
»  ఇంగ్లిష్‌ మాట్లాడగలగాలి

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)