Breaking News

ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా

Published on Mon, 01/15/2024 - 11:08

వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా సాయుధ నౌకపై హౌతీలు ప్రయోగించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని అమెరికా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేసింది. 

ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎవరూ గాయపడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. యెమెన్‌లోని హుడైదా సమీపంలో క్షిపణిని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. యెమెన్ గగనతలం, తీరప్రాంతానికి సమీపంగా అమెరికా విమానాలు ఎగురుతున్నట్లు హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా చర్య యెమెన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. 

ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపైనే దాడులు చేస్తున్నామని తెలుపుతున్నప్పటికీ.. యూరప్ సహా అనేక దేశాల ఓడలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని ఖండించిన అమెరికా మిత్రపక్షాలు హౌతీల దాడులకు అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలపై దాడులు పెంచుతున్నాయి.   

ఇదీ చదవండి: Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)