Breaking News

అత్యంత శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించిన అమెరికా

Published on Fri, 05/23/2025 - 05:23

వాషింగ్టన్‌: అమెరికా వైమానిక దళం అత్యంత శక్తివంతమైన అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం) మినట్‌మ్యాన్‌–3ని  బుధవారం ప్రయోగించింది. దేశానికి క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్‌ డోమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి ప్రయోగించిన సమయంలో రీ–ఎంట్రీ వెహికల్‌ మాత్రమే అమర్చిన ఈ క్షిపణిలో ఎటువంటి ఆయుధాలు లేవని ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది. 

రీ–ఎంట్రీ వెహికల్‌లో సాధారణంగా అణు వార్‌హెడ్‌ను ఉంచుతారు. గంటకు 15 వేల మైళ్లకంటే ఎక్కువ వేగంతో 4,200 మైళ్లు ప్రయాణించిన ఈ క్షిపణి మార్షల్‌ ఐల్యాండ్స్‌లోని యూఎస్‌ ఆర్మీ స్పేస్‌ అండ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ కమాండ్‌లోని రొనాల్డ్‌ రీగన్‌ బాలిస్టిక్‌ డిఫెన్స్‌ టెస్ట్‌ ప్రాంతానికి చేరుకుంది. దేశ అణ్వాయుద సామర్థ్యాన్ని, సర్వసన్నద్ధతను చాటేందుకే ఈ పరీక్ష చేపట్టామని యూఎస్‌ గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ కమాండర్‌ జనరల్‌ థామస్‌ బుస్సెయిర్‌ చెప్పారు. ఇది రొటీన్‌గా చేపట్టే పరీక్ష మాత్రమే తప్ప, ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్య కాదని యూఎస్‌ మిలటరీ స్పష్టం చేసింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)