Breaking News

Syria: ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు

Published on Sun, 01/11/2026 - 07:02

డమాస్కస్‌: సిరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్‌) ఉగ్రవాద ముఠాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సిరియా వ్యాప్తంగా ఉన్న ఐసిస్ నెట్‌వర్క్‌ను మట్టికరిపించే ఉద్దేశంతో ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ మెరుపు దాడుల్లో ప్రాణనష్టం  ఏ మేరకు జరిగిందనే వివరాలను పెంటగాన్  ఇప్పటి వరకూ వెల్లడించలేదు.

గత డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు ఒక  అనువాదకుడు మృతి చెందారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. తమ వ్యూహాత్మక సైనిక చర్యలో భాగంగానే ఈ తాజా దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ప్రస్తుతం సిరియాలో సుమారు వెయ్యి మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సమాచారం. గత కొద్ది నెలలుగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలో ఐసిస్ అనుమానితులపై  గగనతల, భూతల దాడులు నిర్వహిస్తున్నాయి.

13 ఏళ్ల అంతర్యుద్ధం దరిమిలా 2024లో మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను తిరుగుబాటుదారులు గద్దె దించారు. వీరి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం, అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. గత ఏడాది చివరిలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా వైట్ హౌస్ సందర్శించిన సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఉమ్మడి  దాడులు కొనసాగుతున్నాయి.  ప్రస్తుత సిరియా ప్రభుత్వంలో అల్-ఖైదాతో సంబంధం  కలిగిన సభ్యులు కూడా ఉన్నారు. వీరు కూడా ఐసిస్ గ్రూపును వ్యతిరేకిస్తూ, అమెరికాతో కలిసి ఐసిస్ అణచివేతకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా సిరియా భద్రతా దళాలు కూడా అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి దాడుల్లో పాల్గొంటున్నాయి. ఐసిస్‌ ఉగ్రవాద ముఠాను తుడిచిపెట్టడమే లక్ష్యంగా, అంతర్జాతీయ సహకారంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగుతోంది.
 

#

Tags : 1

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)