Breaking News

పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి

Published on Wed, 11/01/2023 - 17:07

పంది గుండెను అమర్చిన మరో వ్యక్తి మరణించాడు. లారెన్స్ ఫాసెట్(58)  అనే వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. దాదాపు 40 రోజుల తర్వాత గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందారని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు తెలిపారు. గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన నెలరోజుల వరకు చక్కగా పనిచేసిందని వెల్లడించాడు. ఆ తర్వాత గుండె పనితీరు క్షీణించడం మొదలయ్యిందని పేర్కొన్నారు.

'గుండె మార్పిడి చేసిన తర్వాత లారెన్స్ ఆరోగ్యంగా గడిపారు. ఫిజికల్ థెరపీలో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. భార్య యాన్‌తో కార్డ్స్‌ కూడా ఆడేవారు. కానీ ఇటీవల గుండె పనితీరులో వైఫల్యం కనిపించింది. మానవ అవయవాల మార్పిడి విధానంలో ‍ఇది అతి క్లిష్టమైన పద్దతి. ఆరు వారాలపాటు ఆరోగ్యంగా గడిపారు. కానీ సోమవారం ప్రాణాలు కోల్పోయారు.' అని మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  

లారెన్స్ నావీలో పనిచేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో టెక్నీషియన్‌గా రిటైర్ట్ అయ్యారు. గుండె సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో హర్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. ఎట్టకేలకు గుండె మార్పిడి చేయగా ఇన్నాళ్లు బతికారని లారెన్స్ భార్య యాన్ తెలిపారు.

జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేసే పద్దతిని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దాతల కొరత సమస్యను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ సవాలుగా మారింది. రోగి రోగనిరోధక వ్యవస్థ మార్పిడి అవయవం పనితీరుకు సరిపోలడం క్లిష్టతరమైంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాలలాగా పనిచేస్తాయని వైద్యులు భావించారు. 

ఇదీ చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)