Breaking News

దటీజ్ ‘C-17A గ్లోబ్ మాస్టర్’!

Published on Sat, 02/08/2025 - 11:31

అక్రమ వలసదారులైన 104 మంది భారతీయులను స్వదేశానికి తిప్పిపంపేందుకు అమెరికా పెట్టిన ఖర్చు రూ.8.74 కోట్లు. ఒక్కొక్కరికి అయిన వ్యయం రూ.8.40,670. అంటే దాదాపు ఎనిమిదన్నర లక్షలు. ఇందుకోసం అమెరికా వినియోగించిన భారీ మిలిటరీ విమానం... C-17A గ్లోబ్ మాస్టర్ III. సైనికులు, వాహనాలు, సరకులను తరలించేందుకు వీలుగా ఈ విమానాన్ని డిజైన్ చేశారు. అమెరికా వాయుసేనకు ఈ విమానాలు పెద్ద బలం, బలగం.

ఇవి 1995 నుంచి సేవలందిస్తున్నాయి. పౌర విమానయానంతో పోలిస్తే సైనిక విమానాల ప్రయాణ వ్యయం అధికంగా ఉంటుంది. C-17A గ్లోబ్ మాస్టర్ గాల్లోకి లేచిందంటే గంటకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. అదే చార్టర్ ఫ్లైట్ విషయంలో గంటకు అయ్యే వ్యయం రూ.7.5 లక్షలే. గగనతలానికి సంబంధించి ఒక్కో దేశానికి ఒక్కోలా భద్రతా ఏర్పాట్లు, వైమానిక విధానాలు ఉంటుంటాయి. అందుకే వాణిజ్య విమానాలు సాధారణంగా ప్రయాణించే గగనతల దారుల్లో కాకుండా మిలిటరీ విమానాలు వేరే మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి.

సాధారణ విమానాశ్రయాల్లో కాకుండా సైనిక స్థావరాల్లోనే మిలిటరీ విమానాలు ఇంధనం నింపుకుంటాయి. 104 మంది భారతీయులతో కాలిఫోర్నియాలో బయల్దేరిన C-17A గ్లోబ్ మాస్టర్...  అటుతిరిగి, ఇటుతిరిగి మధ్యమధ్యలో ఆగుతూ సుమారు 43 గంటలు ప్రయాణించి చివరికి పంజాబ్ చేరింది. ఈ మిషన్ ఖర్చు మిలియన్ డాలర్లను మించిందని మరో అంచనా. అలా చూస్తే ఒక్కో భారతీయుడి తిరుగుటపాకు అమెరికాకు అయిన వ్యయం 10 వేల డాలర్లు. సాధారణ టికెట్ రేట్లను పరిశీలిస్తే... శాన్ ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీకి వన్ వే కమర్షియల్ ఫ్లైట్ ఎకానమీ తరగతిలో రూ. 43,734, బిజినెస్ క్లాస్ అయితే రూ.3.5 లక్షలు ఖర్చు అవుతుంది. అదీ సంగతి!

::జమ్ముల శ్రీకాంత్‌
(Credit: Hindustan Times)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)