Breaking News

భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి..  

Published on Wed, 08/16/2023 - 13:01

లాస్ ఏంజెల్స్: కాలిఫోర్నియాకు చెందిన ఒక జడ్జి బాగా మద్యం సేవించిన తర్వాత భార్యతో వాగ్వాదానికి దిగారు. గొడవ అంతకంతకు పెద్దది కావడంతో మద్యం మత్తులో జడ్జి తనవద్ద ఉన్న తుపాకీని తీసి భార్యను కాల్చి చంపేశాడు. అనంతరం తన సహచరుడికి మెసేజ్ పెడుతూ.. రేపు నేను కోర్టుకి రాలేను.. నేను జైలులో ఉంటానని సందేశం పంపించినట్లు తెలిపారు పోలీసులు.   

కాలిఫోర్నియాకు చెందిన ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జి జెఫ్రీ ఫెర్గ్యూసన్(72) ఆగస్టు 3న తన భార్య షెరిల్(65) ఒక రెస్టారెంటుకు వెళ్లగా అక్కడ వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అలా వారి మధ్య జరిగిన వివాదం కొద్దిసేపటికి బాగా ముదిరిపోయింది.     

ఆరెంజ్ కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ క్రిస్టోఫర్ అలెక్స్ తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా గొడవ సద్దుమణగకపోవడంతో షెరిల్.. పదే పదే వేలు చూపించే బదులు ఒక తుపాకీ  చూపించి కాల్చేయొచ్చు కదా అని అరిచింది. వెంటనే ఫెర్గ్యూసన్ తన వద్ద ఉన్న తుపాకీని తీసి తన భార్య గుండెల్లో చాలా దగ్గర నుండి కాల్చేశారు. అనంతరం తన స్నేహితుడికి ఫోనులో.. నేను సహనం కోల్పోయి, నా భార్యను చంపేశాను.. రేపు నేను రాకపోవచ్చు, బహుశా పోలీసుల అదుపులో ఉంటానేమోనని సందేశం పంపారు. 

అనంతరం ఫెర్గ్యూసన్ స్వయంగా తానే 911కి ఫోన్ చేసి పోలీసులకు విషయాన్ని వివరించారు. పోలీసులు అతడి ఇంటిని సోదా చేయగా ఆయన ఇంట్లో మొత్తం 47 తుపాకులు, 26,000 వరకు మందుగుండు సామాన్లు లభించినట్లు తెలిపారు. అరెస్టు చేసిన సమయంలో జడ్జి ఫెర్గ్యూసన్ బాగా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు కోర్టుకు తెలపగా ఫెర్గ్యూసన్ నేరాన్ని అంగీకరించలేదు. ఆయన తరపు లాయర్ పాల్ మేయర్ ఈ హత్య  ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని పొరపాటున జరిగిందని దీన్ని నేరంగా పరిగణించవద్దని అన్నారు. కోర్టు లాయర్ వాదనంతో ఏకీభవించి జడ్జికి బెయిల్ మంజూరు చేయడమే కాదు మద్యం సేవంచవద్దని హితవు కూడా పలికింది. 

ఇది కూడా చదవండి: ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)