Breaking News

అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం

Published on Mon, 03/17/2025 - 07:57

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో ట్రంప్‌ అధికారం చేపట్టాక దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన విదేశీయులు ఉంటున్న తీరుతెన్నులపై ట్రంప్‌ సర్కారు దృష్టిసారించింది. ఈ నేపధ్యంలో అమెరికన్‌ గ్రీన్‌ కార్టు(American green card) కలిగిన ఒక వ్యక్తి విమానాశ్రయంలో అవమానానికి గురైన ఉదంతం వెలుగు చూసింది.

మార్చి 7న జరిగిన ఈ ఘటనలో అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫాబియన్ స్మిత్‌ను మసాచుసెట్స్‌(Massachusetts)లోని లోగాన్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మిత్ తన టీనేజ్ నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం న్యూ హాంప్‌షైర్‌లో  ఉంటున్నారు. అతను లక్సెంబర్గ్ పర్యటన  అనంతరం తిరిగి వస్తుండగా, ఈ ఉదంతం చోటుచేసుకుంది.  న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం స్మిత్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని దుస్తులను తొలగించి, విచారణకు తీసుకెళ్లారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. స్మిత్ నిర్బంధానికి గల కారణాలు తమకు తెలియవని వారు పేర్కొన్నారు.

స్మిత్  గతంలో తన గ్రీన్ కార్డును పునరుద్ధరించుకున్నారు. అతనిపై ఎటువంటి కోర్టు కేసులు పెండింగ్‌లో లేవు. స్మిత్ స్నేహితుడు అతనిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అయితే అతను ఎంతకీ రాకపోవడంతో అధికారులను సంప్రదించేందుకు నాలుగు గంటలు వేచిచూశారు.  స్మిత్‌ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుని గ్రీన్ కార్డ్ ఫ్లాగ్  అయ్యిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు చెప్పారన్నారు. అయితే దీని వెనుక గల కారణాలను తెలియజేయలేదన్నారు. 2023లో స్మిత్‌ గ్రీన్ కార్డ్ చట్టబద్ధంగా తిరిగి జారీ చేశారని ఆమె తెలిపారు. దానికి చెల్లుబాటు ఉన్నప్పటికీ, స్మిత్‌ను అమెరికాలోకి రాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఎవరైనా చట్టాన్ని లేదా వీసా నిబంధనలను(Visa regulations) ఉల్లంఘిస్తే, వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరించవచ్చని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అసిస్టెంట్ కమిషనర్ హిల్టన్ బెక్హాం న్యూస్ వీక్‌కు తెలిపారు. ఇప్పుడు స్మిత్ నిర్బంధం వివాదానికి దారితీసింది. అమెరికా వలస విధానాలపై పలు అనుమానాలను లేవనెత్తుతోంది.

ఇది కూడా చదవండి: అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)